Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If these 17 marks are not on the Rs.2000 note then it is a counterfeit note

 రూ.2000 నోటుపై ఈ 17 గుర్తులు లేకపోతే అది నకిలీ నోటే : RBI

If these 17 marks are not on the Rs.2000 note then it is a counterfeit note

 మీ దగ్గర రూ.2000 నోటు ఉందా? అది ఒరిజినల్ నోటేనా? మీకు ఇలాంటి డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? నకిలీ నోటును గుర్తుపట్టడం కష్టమే. ఈ 17 గుర్తులు లేకపోతే అనుమానించాల్సిందే..

అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఒరిజినల్ రూ.2000 నోటును ఎలా గుర్తించాలో తమ వెబ్‌సైట్‌లో వివరించింది. 2016లో నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రూ.2000 నోటును రిలీజ్ చేసింది. రూ.2000 కరెన్సీ నోటుపై 17 ముఖ్యమైన గుర్తులు ఉంటాయి. ఆ గుర్తుల్ని గమనిస్తే అది నకిలీ నోటా ఒరిజినల్ నోటా అన్న సంగతి తెలుస్తుంది. రూ.2000 కరెన్సీ నోటులో మహాత్మాగాంధీ బొమ్మ ఉన్నవైపు 12 గుర్తులు ఉంటాయి. వెనుకవైపు 5 గుర్తులు ఉంటాయి. ఆ 17 గుర్తుల్లో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా, కనిపించకపోయినా అనుమానించాల్సిందే.

మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌లో భాగంగా రూ.2000 నోట్లను విడుదల చేసింది ఆర్‌బీఐ. ఈ కరెన్సీ నోటు సైజు 66mm x 166mm సైజులో ఉంటుంది. ఇకపై మీకు ఎప్పుడైనా రూ.2000 నోటుపై అనుమానం ఉంటే ఈ 17 గుర్తులను గమనించండి. వీటితో పాటు రూ.2000 నోటులో పలు చోట్ల 2000 నెంబర్ కూడా కనిపిస్తుంది.  మరి రూ.2000 కరెన్సీ నోటుపై ఉండాల్సిన ఆ 17 గుర్తులు ఏంటో, అవి కరెన్సీ నోటుపై ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకోండి.

మహాత్మాగాంధీ బొమ్మ ఉన్నవైపు 12 గుర్తులు ఉంటాయి.

  • 1. ఎడమవైపు అడ్డంగా 2000 నెంబర్ కనిపిస్తుంది.
  • 2. దాని పక్కనే 2000 నెంబర్ కనిపించకుండా ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది.
  • 3. రెండో గుర్తు పైన అడ్డంగా దేవనాగరి లిపిలో ₹२००० అని కనిపిస్తుంది.
  • 4. కరెన్సీ నోటు మధ్యలో మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది.
  • 5. మహాత్మాగాంధీ చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే హిందీలో భారత్, ఇంగ్లీష్‌లో India అనే పదాలు కనిపిస్తాయి.
  • 6. మహాత్మాగాంధీ చిత్రం పక్కన సెక్యూరిటీ త్రెడ్ ఉంటుంది. అందులో భారత్ అని హిందీలో, RBI, 2000 అని కనిపిస్తాయి. ఈ సెక్యూరిటీ త్రెడ్ గ్రీన్ నుంచి బ్లూ కలర్‌లోకి మారుతుంది.
  • 7. సెక్యూరిటీ త్రెడ్ పక్కన ఆర్‌బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. సంతకం కింద ఆర్‌బీఐ ఎంబ్లమ్ ఉంటుంది.
  • 8. ఆ పక్కన ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అందులో మహాత్మాగాంధీ చిత్రంతో పాటు 2000 నెంబర్ వాటర్‌మార్క్‌లాగా ఉంటుంది. కాస్త వెలుతురులో పెట్టి చూస్తే ఈ గుర్తులు కనిపిస్తాయి.
  • 9. రూ.2000 నోటులో కుడివైపు కింద కరెన్సీ నోట్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ సైజు చిన్న నుంచి పెద్దగా ఉంటుంది. ప్రతీ నోటుకు వేర్వేరు నెంబర్లు ఉంటాయి. ఒకే నెంబర్‌తో రెండు నోట్లు ఉండవు.
  • 10. కరెన్సీ నోటు సీరియల్ నెంబర్ పైన రూపీ గుర్తు, 2000 నెంబర్‌తో ₹2000 కనిపిస్తుంది.
  • 11. రూ.2000 నోటులో కుడివైపు కింద అశోక స్తంభం ఉంటుంది.
  • 12. అంధులు కరెన్సీ నోటును గుర్తించేందుకు నల్లని లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ రెండువైపులా కనిపిస్తాయి.

మిగతా 5 గుర్తులు రూ.2000 నోటు వెనుకవైపు ఉంటాయి.

  • 13. ఎడమవైపు కరెన్సీ నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది.
  • 14. తెల్లని స్పేస్ కింద స్వచ్ఛ్ భారత్ లోగో, నినాదం ఉంటాయి.
  • 15. లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది. ఇందులో తెలుగు సహా 15 భాషల్లో రెండు వేల రూపాయలు అని రాసి ఉంటుంది.
  • 16. మధ్యలో మంగళ్‌యాన్ చిత్రం ఉంటుంది.
  • 17. ఎడమవైపు పైన దేవనాగరి లిపిలో ₹२००० అని కనిపిస్తుంది.


Source: Reserve Bank of India

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If these 17 marks are not on the Rs.2000 note then it is a counterfeit note"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0