Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IIT Professor Alok Sagar who taught Raghuram Rajan Real Story

 అలోక్ సాగర్ ఇతని గురించి తెలుసుకోవాలి

ఇతని స్టోరీ వింటే  ఆశ్చర్యం కలుగుతుంది.

IIT Professor Alok Sagar who taught Raghuram Rajan

 మధ్య ప్రదేశ్ పోలీసులకు  ఒక్క అతను దాదాపు బాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ చూపించాడు, అతని పేరు అలోక్ సాగర్, ఇతను ఢిల్లీ లో మాజీ ఐ ఐ టీ ప్రొఫెసర్ అనే సంగతి మన అందరికి తెలిసిందే, ప్రొఫెసర్ గా తన పదవి కాలం ముగియడంతో ఆధునిక బిజీ ప్రపంచానికి దూరంగా మధ్య ప్రదేశ్ లోని ఒక్క మారు మూల గ్రామం లో అతి సాధారణ మనిషి లాగ బ్రతుకు ప్రక్రుతి ని ప్రేమిస్తూ ,మొక్కలు నాటుతూ, తనకి తెల్సిన విద్య ని నలుగురికి పంచుతూ అలా ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉన్నాడు, అయితే అలాంటి ప్రశాంతమైన జీవితం గడుపుతున్న అలోక్ సాగర్ గురించి ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది ఒక్కే ఒక్క సంఘటన, అది ఏమిటో ఇప్పుడు మనం పూర్తి వివరం గా ఈ కథనంలో తెలుసుకుందాం.

అవి మధ్య ప్రదేశ్ లో ఎన్నికలు జరిగే రోజులు, ఐ పీ ఎస్ ఆఫీసర్ ఆ గ్రామం లో ఎన్నికల ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేస్తున్నాడు, అప్పుడు ఒక్క మనిషి మాసిపోయిన గడ్డం తో వంటి మీద చొక్కా కూడా లేకుండా సైకిల్ మీద అలాంటి హడావుడి సమయం లో కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా పోతుండడం చూసాడు, అతనిని చూసి ఆశ్చర్యపోయిన ఆ అధికారి ఇతను ఎవరు, ఇక్కడ ఏమి చేస్తుంటాడు అని చుట్టూ పక్కన ఉన్న గ్రామస్తులను అడిగాడు, అతని పేరు అలోక్ సాగర్ , మా ఊర్లోనే ఉంటాడు,అంతకు మించి మాకు ఏమి తెలియదు అని ఆ గ్రామస్థలు చెప్పారు, దీనితో కానిస్టేబుల్ తో అతిని పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తాడు సదరు ఎస్ పీ, పేరు ఏమిటి అని అడిగితె అలోక్ సాగర్ అని చెప్తాడు, గుర్తింపు కార్డు అడిగితె ఇక్కడికి తెచ్చుకోలేదు ఇంట్లో ఉంది, నేను భారతీయుడినే బయపడకు, నేను సామాన్య జీవితం బ్రతకడానికి ఈ గ్రామానికి వచ్చాను అని సమాధానం చెప్తాడు అలోక్ సాగర్, అలోక్ సాగర్ మాటలు విని అనుమానించిన ఎస్ పీ అలోక్ సాగర్ ని అరెస్ట్ చేసాడు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నన్ను అని అలోక్ సాగర్ అడగగడం తో నిన్ను అనుమానితుడిగా భావిస్తూ అదుపులోకి తీసుకుంటున్నాం అని ఆ ఎస్ పీ చెప్తాడు.

ఆ తర్వాత అలోక్ సాగర్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లి ఎవరు నువ్వు అని పోలీస్ భాషలో విచారించడం మొదలు పెట్టారు అట, దీనితో ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆవేశం తో ఊగిపోతూ పైకి లేచిన అలోక్ సాగర్ , నా పేరు అలోక్ సాగర్ నేను ఢిల్లీ లో ఐ ఐ టీ ప్రొఫెసర్ , ప్రముఖ ఇండియన్ ఎకనామిస్ట్ అయినా రంగు రామ్ రాజన్ నా శిష్యుడు, కావాలంటే విచారించుకో పో అని గట్టిగ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అలోక్ సాగర్, అలోక్ సాగర్ ఇచ్చిన షాక్ నుండి తేరుకున్న సదరు ఎస్ పీ అతని గురించి ఎంక్వయిరీ చెయ్యగా నిజమే అని తేలడం తో బెటాలియన్ ని వేసుకొని అలోక్ సాగర్ ఇంటికి వెళ్లి అతనిని అవమానించినందుకు అందరూ క్షమాపణలు చెప్పారు అట, అలోక్ సాగర్ ఇండియా లోని టాప్ 5 ఐ ఐ టీ ప్రొఫెస్సొర్స్ లో ఒక్కరు, ఎంతో మంది మహనీయలు ఈయన శిష్యరికం లో ఐ ఏ వైస్ లను ,ఐ పీ ఎస్ లను తీర్చి దిద్దారు ఈయన, అమెరికా లోపని హూస్టన్ యూనివర్సిటీ లో పీ హెచ్ డీ చేసిన ఈయన అక్కడే బోధనలు కూడా చేసేవాడు, అలా రఘు రామ్ రాజన్ కూడా ఈయన క్లాసులను చాలా ఆసక్తిగా అక్కడ వినేవాడు, రిటైర్డ్ అయ్యాక గ్రామం లో ఉంటూ అక్కడ మొక్కల్ని నాటుతూ , గిరిజనులకు అవసరమైన ఆర్థిక సహాయాలు చేస్తూ అలా కాలం ని గడిపిస్తునాడు, ఇదండీ అలోక్ సాగర్ గారి స్టోరీ.


VIEW THE VIDEO


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IIT Professor Alok Sagar who taught Raghuram Rajan Real Story"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0