Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

india Post: India Post offering low interest rates on small savings schemes .. Full details ..

 India Post: చిన్న పొదుపు పథకాలపై అదిరిపోయే వడ్డీరేట్లు అందిస్తోన్న ఇండియా పోస్టు.. పూర్తి వివరాలివే..

india Post: India Post offering low interest rates on small savings schemes .. Full details ..


ఇండియా పోస్ట్ పొదుపు పెట్టుబడి పథకాల ద్వారా మంచి వడ్డీని అందిస్తోంది. ఇండియా పోస్ట్ లో ప్రస్తుతం సీనియర్ సిటిజెన్స్ సేవింగ్ స్కీమ్, మంత్లీ ఇన్ కం అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్రా, సుకన్య సమృద్ది యోజన(ఎస్ఎస్ వై) లాంటి సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి.



భారత్ పోస్టల్ శాఖ దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను విస్తృతంగా నిర్వహిస్తున్న సంస్థల్లో ముఖ్యమైనది. విస్తారమైన పోస్టాఫీస్ నెట్ వర్క్ ద్వారా ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలను అందిస్తోంది. వీటిలో పెట్టుబడి మార్గాలకు పెట్టుబడుదారులను ఆహ్వానిస్తోంది. అంతే కాకుండా ఈ పొదుపు పెట్టుబడి పథకాల ద్వారా మంచి వడ్డీని కూడా అందిస్తోంది. ఇండియా పోస్ట్ లో ప్రస్తుతం సీనియర్ సిటిజెన్స్ సేవింగ్ స్కీమ్, మంత్లీ ఇన్ కం అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్రా, సుకన్య సమృద్ది యోజన(ఎస్ఎస్ వై) లాంటి సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ పొదుపు పథకాలపై వడ్డీరేటు ఎప్పటికప్పుడు మార్చబడుతుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న చిన్న పొదుపు పథకాలను కోసం ఇండియా పోస్ట్, ఇతర ఆర్థిక సంస్థలు విజయవంతంగా కొనసాగిస్తున్నాయి.


పొదుపు పథకాలపై భారత పోస్టల్ శాఖ అందిస్తున్న వడ్డీరేట్లు..




పొదుపు పథకం---వడ్డీరేటు కాంపౌండింగ్---ఫ్రీక్వెన్సీ

పోస్టల్ సేవింగ్స్ ఖాతా---4 శాతం---వార్షికం

ఏడాది టైం డిపాజిట్---5.5 శాతం(ఏడాదికి 10వేల డిపాజిట్ వడ్డీ రూ.561)---త్రైమాసికం

2 సంవత్సరాల టైం డిపాజిట్---5.5 శాతం(ఏడాదికి 10వేల డిపాజిట్ వడ్డీ రూ.561)---త్రైమాసికం

3 ఏళ్ల టైం డిపాజిట్---5.5 శాతం (ఏడాదికి 10వేల డిపాజిట్ వడ్డీ రూ.561)---త్రైమాసికం

5 ఏళ్ల టైం డిపాజిట్---6.7 శాతం(ఏడాదికి 10 వేల డిపాజిట్ కు వడ్డీ రూ.687)---త్రైమాసికం

సీనియర్ సిటిజెన్స్ సేవింగ్ స్కీమ్---7.4 శాతం(మూడు నెలలకు 10 వేల డిపాజిట్ కు వడ్డీ 185)---త్రైమాసిక చెల్లింపు

నెలవారీ ఆదాయం ఖాతా---6.6 శాతం (నెలవారీగా 10 వేల డిపాజిట్ కు వడ్డీ రూ.55)---నెలవారీ చెల్లింపు

ప్రభుత్వ భవిష్య నిధి స్కీమ్---7.10 శాతం---వార్షికం

కిసాన్ వికాస్ పాత్ర---7.60 శాతం---వార్షికం

సుకన్య సమృద్ధి యోజన---7.60 శాతం---వార్షికం


కొన్ని పోస్ట్ ఆఫీసు పొదుపు పథకాలు ఆదాయపు పన్ను ప్రయోజనాలకు కూడా అర్హత పొందుతాయి. ఈ ఉత్పత్తులను ఉపయోగించి పెట్టుబడుదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి రూ.1.5 లక్షల వరకు ఇందులో పెట్టుబడి పెట్టి ఆ మేరకు మొత్తానికి పన్ను పడకుండా జాగ్రత్త పడవచ్చు . టైం డిపాజిట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు లాంటి పథకాల ద్వారా ఆదాయపు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "india Post: India Post offering low interest rates on small savings schemes .. Full details .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0