Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IOCL Recruitment 2021:

 IOCL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. IOCLలో 885 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

IOCL Recruitment 2021:

వరుసగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOCL) నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. 885 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

వరుసగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOCL) నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. 885 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో తాత్కాలిక ప్రతిపదికన కొన్ని, పర్మినెంట్ విభాగంలో మరి కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1.05 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. అప్రంటీస్ ట్రైనీ విభాగంలో ఎంపికైన వారికి అప్రంటీస్ చట్టం ప్రకారం వేతనం చెల్లించనున్నారు. ఈ ఖాళీల భర్తీకి మొత్తం మూడు నోటిఫికేషన్లను విడుదల చేశారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఎవరు అప్లై చేయాలంటే..

ఇంజనీర్స్, టెక్నీషియన్ విభాగాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఇందులో 16 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఖాళీలు కాగా, మరో 869 టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అప్రెంటీస్ ఖాళీలు ఉన్నాయి.

జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ విభాగంలో 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా, రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ లేదా మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 19లోగా అప్లై చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

NOTIFICATION

869 టెక్నీకల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానిక్, మెషినిస్ట్ తదితర విభాగాల్లో ఐటీఐ చేసి ఉండాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాల్లో డిప్లొమా చేసిన వారి కోసం సైతం కొన్ని పోస్టులు ఉన్నాయి. ఇంటర్ పాసై డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో స్కిల్ సర్టిఫికెట్ పొంది ఉన్న వారి కోసం మరి కొన్న పోస్టులు ఉన్నాయి. ఇందులో తూర్పు, పశ్చిమ రీజియన్లలో ఖాళీల కోసం వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన లింకులతో ఆయా నోటిఫికేషన్లను చూడొచ్చు.


NOTIFICATION


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IOCL Recruitment 2021: "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0