SSC MTS Recruitment 2021: Central Government Job with Tenth Class Qualification ... Notification Received
SSC MTS Recruitment 2021 : పదవ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ... నోటిఫికేషన్ వచ్చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. 10వ తరగతి అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందొచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగులు చాలాకాలంగా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న సంగితి తెలిసిందే. మొత్తానికి నోటిఫికేషన్ వచ్చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 21 చివరి తేదీ. ఖాళీల వివరాలను ప్రకటించలేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో ఖాళీల వివరాలను అప్‌డేట్ అవుతాయి. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Candidate"s Corner సెక్షన్‌లో Tentative Vacancy పైన క్లిక్ చేసి ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు.
గతంలో మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్-MTS నోటిఫికేషన్ ద్వారా 9069 పోస్టుల్ని భర్తీ చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. ఈసారి కూడా అంతే సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయొచ్చు.
SSC MTS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
నోటిఫికేషన్ విడుదల- 05.02.2021
దరఖాస్తులు ప్రారంభం- 05.02.2021
అప్లికేషన్‌కు చివరి తేదీ- 2021 మార్చి 21 రాత్రి 11.30 గంటలు
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్‌కు చివరి తేదీ- 2021 మార్చి 23 రాత్రి 11.30 గంటలు
చలాన్ జనరేషన్‌కు లాస్ట్ డేట్- 2021 మార్చి 25 రాత్రి 11.30 గంటలు
చలాన్ పేమెంట్‌కు లాస్ట్ డేట్- 2021 మార్చి 29 బ్యాంకు వేళలు ముగిసేలోపు
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్ 1)- 2021 జూలై 1 నుంచి జూలై 20
టైర్ 2 ఎగ్జామినేషన్- 2021 నవంబర్ 21
SSC MTS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
మొత్తం ఖాళీలు- త్వరలో వెల్లడించనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి
వయస్సు- 2021 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- రెండు దశల పరీక్ష
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు- ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి సిలబస్ కోసం క్రింద చూడగలరు.
0 Response to "SSC MTS Recruitment 2021: Central Government Job with Tenth Class Qualification ... Notification Received"
Post a Comment