Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A compass for the future of municipal school students

పురపాలక పాఠశాలల విద్యార్థుల భవితకు దిక్సూచి

A compass for the future of municipal school students

 కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం కౌన్సెలర్లతో వారికి మార్గనిర్దేశం

కెరీర్ గైడెన్స్ సెంటర్లుగా ఇంగ్లీష్ ల్యాబ్లు

రాష్ట్రంలో 14 ల్యాబ్లను ఏర్పాటు చేయనున్న పురపాలక శాఖ

3.50 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం


  పురపాలక పాఠశాలల విద్యార్థు లకు ఉజ్వల భవిష్యత్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. వారికి ఇంగ్లిష్ భాషలో విషయ పరిజ్ఞానం పెంపొందించేందుకు రాష్ట్రంలో ఇంగ్లీష్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని నిర్ణ యించింది. 13 జిల్లా కేంద్రాలతోపాటు వైఎస్సార్  జిల్లా పులివెందులలో వీటిని నెలకొల్పుతారు. దీని కోసం ఇప్పటికే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంగ్లీష్, గణితం, సైన్స్ సబ్జెక్టులపై ప్రధానంగా దృష్టిసారించి మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒలంపియాడ్ విధానంలో శిక్షణ ఇవ్వనుంది.నుంచి వీటిని అందుబాటులోకి తేవాలని పురపా లక శాఖ నిర్ణయించింది. అన్ని పురపాలక పాఠశా లలను ఇంగ్లీష్ ల్యాబ్స్ తో అనుసంధానిస్తారు. దీనికి అవసరమైన సాఫ్ట్వేర్ ను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యా లయం సమకూర్చడంతోపాటు కౌన్సెలర్లను కూడా నియమిస్తుంది. వీరు చిల్డ్రన్ ఒలంపియాడు నిర్వహిస్తూ విద్యార్థుల ఆసక్తి, స్థాయిలను గుర్తి స్తారు. తద్వారా వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను వివరించి.. ఉన్నత విద్య కెరీర్ ఎంపిక దిశగా మార్గనిర్దేశం చేస్తారు ప్రధానంగా విదేశాల్లో విద్యాభ్యాసం కోసం అవసర మైన ఐఈఎల్ టీఎస్ పరీక్షలో అర్హత సాధించేందుకు శిక్షణ ఇస్తారు. ఏటా కనీసం 1,500 మంది విద్యా ర్థులు ఐఈఎల్టీఎస్ లో అర్హత సాధించేలా చేయాలని పురపాలక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది లక్ష్యసాధన దిశగా వారిని నడిపేందుకు కేంద్రిడ్జ్ వర్సిటీ ప్రత్యేకంగా ఇ-కరిక్యులంను రూపొంది స్తుంది. దీనికోసం పురపాలక శాఖ రాష్ట్రంలో మూడు డిజిటల్ స్టూడియోలను ఏర్పాటు చేయనుంది. కెరీర్ గైడెన్స్ కేంద్రాలతో రాష్ట్రంలో 2,100 పురపాలక పాఠశాలల్లోని దాదాపు 3.50 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందు తారు. ఇప్పటికే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నిపుణు లతో రాష్ట్రంలో దాదాపు 12 వేల మంది పురపాలక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించి సర్టిఫి

కెట్లు ప్రదానం చేశారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A compass for the future of municipal school students"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0