AP government makes key decision on vaccine
టీకాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరగడంతో వ్యాక్సినేషన్ విషయంలో వెసులుబాటు ఇచ్చింది. 60ఏళ్లు దాటినవారికి, 45ఏళ్లు పైబడి దీర్ఘ కాలిక వ్యాధులతో ఉన్నవారికి టీకా వేస్తున్న ప్రభుత్వం.. గతంలో ఆన్ లైన్ లో పేరు నమోదు చేయించుకోవడం తప్పనిసరి చేసింది. అయితే ఇప్పుడా నిబంధన తీసేసింది. ఆన్ లైన్ లో పేరు నమోదు చేసుకోకపోయినా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకునేందుకు అనుమతిస్తున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారు నేరుగా ఆస్పత్రికి వెళ్లి వయసు నిర్థారించే ధ్రువపత్రం చూపించి టీకా తీసుకోవచ్చని చెప్పారు. 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్య ధ్రువీకరణ పత్రంతో టీకా పొందచ్చని స్పష్టం చేశారు. ఇక ఫ్రంట్‌లైన్ వారియర్లు… నేరుగా ఏ వ్యాక్సినేషన్ కేంద్రానికైనా వెళ్లినా వారికి టీకా ఇస్తారు.
మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంతో పాటు పంజాబ్‌లోనూ ఆంక్షలు విధించారు. అక్కడే కాదు.. మనదగ్గర కూడా మళ్లీ కేసులొస్తున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం గరిష్టంగా 210 కేసులు నమోదయ్యాయి. దీంతో టీకా విషయంలో ప్రభుత్వం ప్రజలకు వెసులుబాటునిచ్చింది. అన్ని ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ వేస్తారని వైద్యాధికారులు తెలిపారు. ఆస్పత్రుల జాబితాను cowin.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని వైద్యారోగ్య శాఖ పేర్కొంది
0 Response to "AP government makes key decision on vaccine"
Post a Comment