Calcium is essential for good bones .How do we get it? Description.
ఎముకలు పుష్టిగా ఉండాలంటే , క్యాల్షియం చాలా అవసరం .అది మనకు ఏయే పదార్ధాలలో ఎలా వస్తుంది ? వివరణ.
ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి కావాల్సిన క్యాల్షియం చాలా అవసరం. నాడులు సరిగా పని చేయాలంటే క్యాల్షియం ఖచ్చితంగా కావాలి. అందుకే పెద్దవాళ్లు రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల క్యాల్షియం తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే క్యాల్షియం ఎక్కువగా పాలలో లభిస్తుంది. కానీ పాలు ఇష్టపడని వాళ్ళు కొన్ని పదార్థాలను చేర్చుకోవడం చాలా మంచిది. వీటిలో క్యాల్షియం తోపాటు ఇతరత్రా విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా లభిస్తాయి. ఆ ఆహారాలు ఏమిటో వాటివల్ల లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
అంజీర పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఈ పండ్లు అర కప్పు తీసుకోవడం వల్ల 121 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది.
ఇందులో పొటాషియం, పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు మెగ్నీషియం కూడా ఉంది. ఇది కండరాల పనితీరు మెరుగుపరుస్తుంది. ఇంకా గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.
నారింజ పండు తినడం వల్ల కూడా మనకు కావల్సిన క్యాల్షియం అందుతుంది. ఒక పెద్ద నారింజ పండ్లు తీసుకోవడం వల్ల 74 మిల్లీ గ్రాములు క్యాల్షియం అందుతుంది. ఇందులో నిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి శక్తి కూడా లభిస్తుంది. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
చేపలు తినడం వల్ల క్యాల్షియం పుష్కలంగా అందుతుంది. వీటిలో 120 గ్రాముల చేపలను తీసుకుంటే 351 గ్రాముల కాల్షియం అందుతుంది. అంతేకాకుండా మెదడు, నాడివ్యవస్థల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ బి12 కూడా ఉంది. ఈ క్యాల్షియం వల్ల ఎముకలు దృఢం గా ఉండడమే కాకుండా, పుష్టిగా కూడా ఉంటాయి.
బెండకాయ లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా ఒక కప్పు బెండకాయ తింటే 82 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుంది. ఇంకా ఇందులో విటమిన్ బి 6, పోలేటి వంటివి కూడా ఉంటాయి.
పాదం పప్పు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. 30 గ్రాముల బాదం పప్పు తినడం వల్ల 75 మిల్లీగ్రాముల క్యాల్షియం అందుతుంది. కానీ బాదంపప్పును పొట్టు తీయకుండా తినడం చాలా మంచిది. విటమిన్ ఇ, పొటాషియం కూడా అధికంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. అయితే బాదం పప్పును మితంగా తినాలి. ఎక్కువ తీసుకోకుండా ఉండటం మంచిది.
0 Response to "Calcium is essential for good bones .How do we get it? Description."
Post a Comment