Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details of how much a bank charges for file traction at an ATM.

 ఏటీఎం వద్ద ఫెయిల్డ్ ట్రాక్సక్షన్ కు ఏయే బ్యాంకులు ఎంత చార్జ్ చేస్తాయో వివరాలు.

Details of how much a bank charges for file traction at an ATM.


బ్యాంక్ ఖాతాదారుడు బ్యాంకు నుంచి లేదా ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తుండటం సాధారణం.. అయితే ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకునేటప్పుడు మీ ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారా? ఉదాహారణకు మీ అకౌంట్ లో రూ. 3000 ఉంటే ఏటీఎంలో   రూ. 35000 విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆ లావాదేవి విఫలమయ్యే అవకాశముంది. అయితే ఆ విఫలమైన లావాదేవికి మీ నుండి చార్జీలు చేయవచ్చు.

చాలా బ్యాంకులు ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునే నిబంధనలను డిసెంబర్ 2020 నుంచి అమల్లోకి తెచ్చాయి. అయితే ఏటీఎం నుంచి నగదు తీసుకునేటప్పుడు  మీ బ్యాంకు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే ఆ లావాదేవి ఫెయిల్డ్ అవుతుంది.

ఇందుకుగాను జరిమానా చెల్లించాలి.  డబ్బులు విత్ డ్రా చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా మీ బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవాలి.

విఫలమైన లావాదేవిపై ఎన్ని రకాలుగా బ్యాంకులు చార్జీలు విధిస్తాయి?

SBI కస్టమర్లు ఎంత చెల్లించాలి?

ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునేటప్పుడు  అకౌంట్ లో తగినంత బ్యాలెన్స్ లేకపోతే.. విఫలమైనా లావాదేవికి 20 రూపాయల ఫైన్ చెల్లించాలి. అంతేకాదు ఈ జరిమానాపై జీఎస్టీ కూడా విధించబడుతుంది.  విఫలమైన లావాదేవిలపై హెచ్ డీఎఫ్ సీ , యాక్సిస్, కోటక్ మహింద్రా, ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా జరిమానాలు వసూలు చేస్తున్నాయి.

హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు వినియోగదారుడు ఎంత చెల్లించాలి..?
భారతదేశం వెలుపల ప్రపంచంలో ఎక్కడైనా ఇతర బ్యాంకు ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసినప్పుడు తగినంత బ్యాలెన్స్ లేకపోతే.. ప్రతి లావాదేవికి 25రూపాయలతోపాటు అదనంగా పన్నులు చెల్లించాలి.

కోటక్ మహింద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఎటీఎం విఫలమైన లావాదేవికి 25 రూపాయలు వసూలు చేస్తున్నాయి. అంతేకాదు.. తగినంత బ్యాలెన్స్ లేకపోతే ప్రతి బ్యాంకు 25 రూపాయలు వసూలు చేస్తుంది.

ఈ జరిమానాలను ఎలా నివారించుకోవాలి..?
ఏటీఏంలో నగదును ఉపసహరించునే సమయంలో మీ ఖాతాలో ఎంత డబ్బు ఉందో చెక్ చేసుకోవాలి. ఎస్ఎంఎస్, కాల్స్ ద్వారా మీ అకౌంట్ లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.అంతేకాదు యూపీఐ యాప్ ద్వారా లేదా సంబంధిత బ్యాంక యాప్ ద్వారా తనిఖీ చేసుకోవాలి.

అయితే ఇతర బ్యాంకు ఏటీఎంల్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి చార్జ్ వసూలు చేస్తారు. మీ రు ఖాతా కలిగిన బ్యాంకు ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకు ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.  చాలా బ్యాంకులు 5 నుంచి 8 రూపాయలు వసూలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఉచితంగానే సేవలు అందిస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details of how much a bank charges for file traction at an ATM."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0