Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ESIC Recruitment 2021: Apply for 6,552 Upper Division Clerks and Stenographers posts

 ESIC Recruitment 2021 నిరుద్యోగులకు శుభవార్త. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. పూర్తి వివరాలు

ESIC Recruitment 2021: Apply for 6,552 Upper Division Clerks and Stenographers posts


ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC భారీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టబోతోంది. అప్పర్ డివిజన్ క్లర్క్-UDC, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టుల భర్తీకి ఈఎస్ఐసీ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 

మొత్తం 6,552 పోస్టుల్ని భర్తీ చేయనుంది. అందులో అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు 6,306, స్టెనోగ్రాఫర్ పోస్టులు 246 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, ఇతర వివరాలన్నీ డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో ఉంటాయి.

ఈ పోస్టులకు విద్యార్హతల వివరాలు చూస్తే స్టెనోగ్రాఫర్ పోస్టుకు 12వ తరగతి పాస్ కావాలి. కంప్యూటర్‌కు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. ఇంగ్లీష్, హిందీలో నిమిషానికి 80 పదాలు టైప్ చేయగలగాలి.

ఇక అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. కంప్యూటర్‌కు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపికైన వారికి వేతనం రూ.25,500 ఉంటుంది. వేతనంతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ లాంటివి ఉంటాయి. 
ఆసక్తి గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వివరాల కోసం esic.nic.in వెబ్‌సైట్ ఫాలో అవుతూ ఉండాలి. మార్చి చివరివారం లేదా ఏప్రిల్ మొదటివారంలో నోటిఫికేషన్ విడుదల కావొచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ESIC Recruitment 2021: Apply for 6,552 Upper Division Clerks and Stenographers posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0