GATE 2021 Result Announced - 17.82% Qualified - Check the Details
గేట్-2021 ఫలితాలు విడుదల 126,831మంది ఉత్తీర్ణత -ఏపీ విద్యార్థులకు 3 మరియు 4 ర్యాంకులు.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2021లో మొత్తం 126,831 విద్యార్థులు అర్హత సాధించారు. ఈసారి పరీక్షలకు 8.82 లక్షల మంది దరఖాస్తు చేయగా 7,11,542 మంది హాజర య్యారు. వారిలో 17.82 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 75 వేల మంది రాసి ఉంటారని అంచనా.
ఏపీలోని భీమవరం విద్యార్థి నూకల విశ్వతేజకు మెకానికల్ ఇంజినీరింగ్ లో 3వ ర్యాంకు దక్కింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం భట్టువానిపల్లికి చెందిన అఖిల్ గేట్ ఈసీఈ విభాగంలో నాలుగో ర్యాంకు సాధించాడు. ఐఐటీ-బొంబాయి గేట్ ఫలితాలను శుక్రవారం రాత్రి వెల్లడించింది. ఉత్తీర్ణులైన వారిలో 98,732 మంది అబ్బాయిలు, 28,081 మంది అమ్మాయిలు ఉన్నారు. గేట్ ఆన్లైన్ పరీక్షలను గత నెలలోనే నిర్వహించారు. గేట్ స్కోర్ కాలపరిమితి మూడేళ్లపాటు ఉంటుంది. అంటే మూడేళ్లలో ఎంటెక్ -కోర్సుల్లో ప్రవేశాలు తీసుకోవచ్చు. ఈ స్కోర్ ఆధారంగా ఎంటెక్ లో చేరిన వారికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి నెలకు రూ.12,500 చొప్పున రెండేళ్లపాటు స్కాలర్షిప్ మంజూరవుతుంది.
WEBSITE https://gate.iitb.ac.in/index.php
Thank you for nice information
ReplyDeletehttps://journal.uhamka.ac.id/index.php/rektek/index