How to Apply for Employees Health Cards Online.
How to Apply for Employees Health Cards Online.
ఉద్యోగులు ఫోటోలను మరియు వారిపై ఆధారపడిన కుటుంబసబ్యుల ఫోటోలను అప్ లోడ్ చేయని విషయం గమనించడమైనది. అటువంటి ఉద్యోగులు www.ehf.gov.in అనే వెబ్ పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యి తమ ఎంప్లాయి ఐ.డిని (employee ID) యూజర్ ఐ.డి.ని మొదటిసారి పాస్ వర్డ్ గా వినియోగిస్తూ ఫోటోలను అప్లోడ్ చేసుకోవచ్చును. ఈ ప్రక్రియలో ఉద్యోగులు, తమపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలను కూడా అప్ డేట్ చేసే వీలు కలదు. ఇందుకు అనుసరించ వలసిన విధానం ఈ క్రింద ఇవ్వబడినది.
ఆధారపడిన కుటుంబసభ్యులు
ఫొటో: 45: 35 మిల్లీమీటర్ల కొలతతో (ఐసిఎవో తరహ) పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోను జతచేయండి. ఇది 20౦ కె.బి కంటే తక్కువ సైజుండాలి.ఉద్యోగి జీవిత భాగస్వామి కూడా రాష్ట్ర ప్రభుత్వోద్యోగి లేదా సర్వీస్ పించను పొందుతున్న వారైతే దరఖాస్తులోని నిర్ణీత ప్రదేశంలో ఆ వివరాలను నమోదు చేయాలి.జనన ధృవీకరణ సర్టిఫికెట్: ఐదేళ్ళ లోపు వయసున్న కుటుంబసభ్యులున్నట్లయితే వారి జనన ధృవీకరణ సర్టిఫికెట్లను స్కాన్‌చేయండి.కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అంగవైకల్యం వున్నట్లయితే వికలాంగ ధృవీకరణ పత్రాన్ని స్కాన్‌చేయండి.
ఆరోగ్యకార్డులు
లబ్దిదారులకు ఈ పధకం ప్రయోజనాలు వెంటనే అందేందుకు అనుగుణంగా, అర్హులయినవారికి తాత్కాలిక ఆరోగ్యకార్డులను జారి చేయడం జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా సమర్పించబడిన దరఖాస్తులను డాక్టర్ ఎన్ టి ఆర్ వైద్య సేవా ట్రస్ట్ పరిశీలన పూర్తికాగానే లబ్దిదారుల లాగిన్లలోనే ఒక తాత్కాలిక ఆరోగ్యకార్డును జతచేయడం జరుగుతుంది. ఇంటర్నెట్ సాయంతో లబ్దిదారులు ఈ డిజిటల్ కార్డులను పొంది. వాటిని ప్రింట్ తీసుకొని, లామినేషన్ చేయించుకుని తాత్కాలికంగా ఉపయోగించుకోవచ్చు.
అలాగే, మీసేవ కేంద్రాల్లో (డైరెక్టర్, ఇఎష్ డి, ఐటి&సి పేర్కొన్న ప్రకారం) రు.25 కి మించకుండా రుసుము చెల్లించి కూడా ఈ తాత్కాలిక ఆరోగ్యకార్డులను పొందవచ్చు.తాత్కాలిక ఆరోగ్యకార్డును పొందినవారందరూ ఎంపిక చేయబడిన ఆసుపత్రుల్లో చికిత్సలు పొందేందుకు అర్హులు. ఈ కార్డు వుంటే ఈ ఆసుపత్రుల్లో చికిత్సను వెంటనే ప్రారంభిస్తారు. డాక్టర్ ఎన్ టి ఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఎంపిక చేసిన ఆసుపత్రుల వివరాలను www.ehf.gov.in వెబ్ సైట్లో గమనించ వచ్చు.
Click here for login EHF Official website at www.ehf.gov.in
స్మార్ట్ హెల్త్ కార్డ్ జారీకి ఏర్పాట్లు
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు క్యూఆర్ కోడ్ తో ఈహెచ్ఎస్ స్మార్ట్ హెల్త్ కార్డ్ జారీ చేయనున్నట్లు డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ డాక్టర్ ఎ. మల్లికార్జున, ఒక ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ హెల్త్ కార్డ్ జారీ కోసం వివరాలను ఈహేచెస్ పోర్టల్ లాగిన్ ద్వారా సరిచూసుకొని, ఏడు రోజులలో మార్పులు చేసి అప్డేట్ చెయ్యాలని సూచించారు. . ఈహేచెస్ పోర్టల్ లో యూజర్ ఐడి పాస్వర్డ్ లతో లాగిన్ అయ్యాక, డౌన్ లోడ్ హెల్త్ కార్డ్స్ మీద క్లిక్ చేశాక ఎడిట్ కార్డ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందని దాని మీద క్లిక్ చేసి వివరాలను అప్డేట్ చేయాలన్నారు.
ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఈ విషయాన్ని గమనించి మీ లాగిన్ సరిచూసుకొని అందులో మీ పేరు, జెండర్, చిరునామా, ఫోటో, ఆధార్ నెంబర్ మరియు ఫోన్ నెంబర్ సరిగా ఉన్నాయో లేదో గమనించి అక్కడ ఏదైనా తప్పులు ఉన్నచో సరిదిద్దుకోదానికి ఏడు రోజులు గడువు ఉంటుందని . అప్డేట్ చెయ్యక పోతే ఉద్యోగస్తుల, పెన్షనర్ల దరఖాస్తులో ఉన్న వివరాలు సరైనవే అని భావించి స్మార్ట్ హెల్త్ కార్డులో ఆ వివరాలు ప్రింట్ నమోదవుతాయన్నారు.
EHS Smart Helath Card Toll free Number Helpline
ఏదైనా సందేహాలు ఉంటె టోల్ ఫ్రీ నెంబర్ 104 లేదా 8333817469, 8333817406, 8333817414 లకు ఫోన్ చెయ్యాలని సూచించారు.ap_ehf@ysraarogyasri.ap.gov.in, ap_c439@ysraarogyasri.ap.gov.in కి మెయిల్ చేయొచ్చన్నారు.
ప్రధానోపాధ్యాయులు /మండల విద్యాశాఖాధికారులు లాగిన్ లో ట్రాన్ఫర్ ఐపోయిన ఉపాధ్యాయులను తొలగించుటకు
1) మీ DDO code తో లాగిన్ కండి
2) Registrations tab లో initiate transfer లోకి వెళ్ళండి
3) ట్రాన్ఫర్ చేయాల్సిన ఉపాధ్యాయుని ట్రెజరీ ఐడీ ఎంటర్ చేసి Retrieve details పై క్లిక్ చేయండి.
4) DDO అడ్రస్, జీతం, డిసిగ్నేషన్ తదితర వివరాలు మార్చి సబ్‌మిట్ చేయండి.
ఎవరికైనా లాగిన్ సమస్యలుంటే (Helpdesk)
1)http://www.ehs.ap.gov.in/EHSAP లోకి లాగిన్ కాకమునుపే Any issue/complaint లోకి వెళ్ళండి. వివరాలతో పాటు మీ కంప్లైంటును మీ సంతకం మరియు DDO సంతకంతో కూడిన పత్రాన్ని జతపరచి సబ్‌మిట్ చేయండి.
2) రెండు మూడు రోజులలో వివరాలు సరిచేయబడతాయి. ap_ehf@ysraarogyasri.ap.gov.in కు మీ కంప్లైంటును మెయిల్ చేయండి
0 Response to "How to Apply for Employees Health Cards Online."
Post a Comment