Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Navodaya reading is similar to IAS training

 నవోదయ చదవడం IAS శిక్షణ లాంటిదే

Navodaya reading is similar to IAS training
నమూనాలు పరిశీలిస్తున్న కలెక్టర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్లు

జవహర్‌ నవోదయ విద్యాలయంలో చదవడం అంటే చిన్న వయసులోనే ఐఏఎస్‌ శిక్షణ తీసుకోవడం లాంటిదని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఏపీ దర్శన్‌లో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన 10 మంది అసిస్టెంట్‌ కలెక్టర్లతో కలిసి జిల్లా కలెక్టర్‌ సోమవారం లేపాక్షి నంది విగ్రహాన్ని దర్శించి, ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అనంతరం లేపాక్షిలోని జవహర్‌ నవోదయ విద్యాలయాన్ని సందర్శించారు. వర్చువల్‌, డిజిటల్‌ క్లాస్‌రూంలను పరిశీలించి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్‌ కలెక్టర్లకు జిల్లాలో ఉత్తమ విద్యాలయాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే నవోదయను ఎంపిక చేసిందని తెలిపారు.


నవోదయ విద్యాలయాల్లో బయటి రాష్ట్రాల నుంచి మన భాష తెలియని విద్యార్థులు మనతో పాటు కలిసి చదువుకుంటారని తద్వార వివిధ దేశాల సంస్కృతులు అలవాడుతాయన్నారు.


పాఠశాల విద్య ఎంతో ముఖ్యమైనది


విద్యార్థులకు పాఠశాల విద్య ఎంతో ముఖ్యమైనదని అసిస్టెంట్‌ కలెక్టర్లు జి.సూర్య సాయి ప్రవీణ్‌చంద్‌, అభిషేక్‌, అపరాజిత సింగ్‌, కట్టా సింహాచలం, నవీన్‌ మల్లారపు, విష్ణు చరణ్‌, భావ్న, చాహత్‌ బైపాల్‌, నిధి మీనా, వికాస్‌ మర్మట్‌ పేర్కొన్నారు. తాము ఐఏఎస్‌ సాధన కోసం పడ్డ శ్రమను తెలుపుతూ విద్యార్థులు కూడా వారివారి రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని అభిలషిస్తూ వారిలో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను వారు నివృత్తి చేశారు. అంతకు ముందు కలెక్టర్‌తో కలిసి విద్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నిషాంతి, డిప్యూటీ కలెక్టర్‌ నిశాంత్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్‌ డీడీ యుగంధర్‌, ఏపీఎంఐపీ పీడీ సుబ్బారాయుడు, హార్టికల్చర్‌ డీడీ పద్మలత, నవోదయ ప్రిన్సిపల్‌ భాస్కర్‌కుమార్‌, తహసీల్దార్‌ బలరాం, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Navodaya reading is similar to IAS training"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0