New Job Portal: Center's key decision .. New job portal for workers .. Here are the full details!
New Job Portal: కేంద్రం కీలక నిర్ణయం.. కార్మికుల కోసం నూతన జాబ్ పోర్టల్.. పూర్తి వివరాలు ఇవే.!
Special Job Portal For Workers: కేంద్ర ప్రభుత్వం ఓ నూతన జాబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని.. మధ్యవర్తులు, కాంట్రాక్టర్లతో సంబంధం లేకుండా నేరుగా ఎంఎస్ఎంఇలతో అనుసంధానం కావచ్చునని తెలిపింది. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధిలోని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్‌మెంట్ కౌన్సిల్ (టిఫాక్), ఎంఎస్‌ఎంఇల అవసరాలకు అనుగుణంగా కార్మికులకు స్కిల్స్ మ్యాపింగ్‌ను నిర్వహించేందుకు వీలుగా నూతన జాబ్ పోర్టల్ ‘సాక్షమ్’ను ప్రారంభించింది.
ఈ పోర్టల్ మధ్యవర్తులు, లేబర్ కాంట్రాక్టర్ల ప్రమేయాన్ని తగ్గించడంతో పాటు కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తుంది.
అలాగే వారిలోని నైపుణ్యాలను సైతం గుర్తిస్తుందని టిఫాక్(TIFAC) తెలిపింది. కాగా ఈ పోర్టల్ కార్మికులను శ్రమను తగ్గించి ఎంఎస్‌ఎంఇలతో నేరుగా అనుసంధానం చేస్తుందని స్పష్టం చేసింది.
సాక్షమ్ పోర్టల్ విధివిధానాలు ఇలా ఉన్నాయి..
1) దేశవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఇల అవసరాలకు అనుగుణంగా సాక్షమ్ జాబ్ పోర్టల్ కార్మికులకు స్కిల్స్ మ్యాపింగ్‌ను నిర్వహిస్తుంది. దీనితో ఎలాంటి ఒత్తిడి లేకుండా కార్మికులు ఉద్యోగాన్ని పొందగలరు.
2) సాక్షమ్ పోర్టల్ కార్మికుల్లోని నైపుణ్య స్థాయిని గుర్తించిన తరువాత, వారికి స్కిల్ కార్డులు ఇస్తుంది. వాటి ద్వారా తమ సమీప ప్రాంతాల్లోని MSMEలలో కార్మికులు సులభంగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
3) దీని ద్వారా భారతదేశం అంతటా 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి
4) సాక్షమ్ నేరుగా కార్మికులను ఎంఎస్‌ఎంఇలతో అనుసంధానం చేస్తుంది.
5) ఈ వెబ్ పోర్టల్ వల్ల ఇప్పటికే అనేక స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి. ఏది ఏమైనా, యువత వారి స్వంత స్టార్టప్‌లు నెలకొల్పేందుకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తామని డిఎస్‌టి కార్యదర్శి అశుతోష్ శర్మ అన్నారు
ఎంఎస్‌ఎంఇలతో పాటు, సముద్రపాచి పరిశ్రమ కోసం కార్మికుల స్కిల్స్ మ్యాపింగ్‌ను కూడా నిర్వహిస్తోంది. ఇటీవల కాలంలో ఈ పరిశ్రమపై ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపుతోంది. కాగా, ఈ పోర్టల్‌ను టిఫాక్ 34వ ఫౌండేషన్ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు.
0 Response to "New Job Portal: Center's key decision .. New job portal for workers .. Here are the full details!"
Post a Comment