Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New prices effective from April 1 ..... What are the price hikes? Which ones are cheaper?

 ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమలు ధరలు పెరిగేవి ఏవి ? ధరలు తగ్గేవి ఏవి ? పూర్తి వివరాలు.

New prices effective from April 1 ..... What are the price hikes?  Which ones are cheaper?

దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతుంది. బడ్జెట్ 2021-22 ప్రకారం ఏప్రిల్ 1 నుంచి కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. మరికొన్ని వస్తువులు తగ్గనున్నాయి. పాలు, ఏసీ, ఫ్యాన్, టీవీ, స్మార్ట్ ఫోన్లు, విమాన టికెట్లు, కార్ల ధరలు, ముడి సిల్క్, నూలు వస్త్రాల ధరలు, సింథటిక్, లెథర్, వంట నూనె, ఎల్‌ఈడీ బల్బులు, సోలార్ ఇన్వర్టర్లు, మొబైల్ ఛార్జర్ల, లిథియంతో చేసిన ఫోన్ బ్యాటరీల ధరలు పెరగనున్నాయి. పాల ధర లీటర్‌కు రూ.3 పెరిగే ఛాన్సుండగా.. టీవీ మోడల్‌ను బట్టి రూ.2-3వేల వరకు, ఏసీల ధరలు కూడా రూ.2-3 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయంగా దాదాపు అన్ని ఎలక్ట్రానిక్​ కంపెనీలు ఏసీలు, ఫ్రిజ్​ల ధరలు పెంచనున్నట్లు అధికారిక సంకేతాలు కూడా ఇచ్చాయి.

రేట్లు పెరగనున్న వస్తువులు

1. ఎల్ఈడీ టీవీలు- టీవీల రేట్లు కనీసం 3వేలు పెరగనున్నాయి. ప్రముఖ సంస్థ ఎల్.జీ ఇప్పటికే రేట్లు పెంచేయగా. ఇతర సంస్థలు కూడా అదే బాటలో నడిచాయి. చైనా నుండి దిగుమతి చేసుకునే పరికరాల ధరలు పెరగటంతో టీవీల రేట్లు పెంచుతున్నట్లు అన్ని సంస్థలు ప్రకటించాయి

2. పాలు

పాల రేట్లు లీటర్ కు మూడు రూపాయల మేర పెంచేందుకు కంపెనీలు దృష్టిపెట్టాయి

3. ఫ్యాన్-ఏసీ, కూలర్లు

ఏసీలతో పాటు ఫ్యాన్లు, కూలర్ల రేట్లు కనీసం 2-8శాతం మేర రేట్లు పెరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్, కరోనా ప్రభావంతో రేట్లు పెరిగాయి.

4. కార్ల ధరలు

దేశీయ దిగ్గజ సంస్థలే కాదు ఇతర దేశాల ఆటోమైబైల్ రంగ కంపెనీలన్నీ ఇప్పటికే కార్ల ధరలను పెంచుతూ ప్రకటన చేశాయి. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. ఎంపిక చేసిన బ్రాండ్లపై కనీసం 30వేల రూపాయల పెంపు ఉందని తెలుస్తోంది.

5. స్మార్ట్ ఫోన్స్

స్టార్ట్ ఫోన్స్ తయారీలో వాడే ముడి పధార్థాలు, చిప్ పరికరాల రేట్లు పెరిగినందున. స్మార్ట్ ఫోన్స్ రేట్లు పెంచుతున్నామని కంపెనీలు ప్రకటించాయి.

రేట్లు తగ్గనున్న వస్తువులు

అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గించడంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ జాబితాలో పసిడి, వెండి ధరలు తగ్గుతాయి. ప్లాటినం, పల్లాడియం ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలతో పాటు.. అంతర్జాతీయ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలు, యంత్రాల రేట్లు తగ్గనున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New prices effective from April 1 ..... What are the price hikes? Which ones are cheaper?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0