Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

No rest to Teacher

 మాస్టారు కు తీరిక లేదు !

No rest to Teacher

విజయవాడ సమీపంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇటీవల హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు . వెంటనే తోటి ఉపాధ్యాయులు అతనిని ఆసుపత్రికి తర లించారు . ఈ ఘటనకు కారణాలు విశ్లేషిం చగా ... విద్యాశాఖ ప్రవేశ పెట్టిన యాప్ లతో కుస్తీ పడుతూ , సర్వర్ తదితర సమస్యలతో సకాలంలో పని పూర్తి కాక తీవ్ర ఒత్తిడికి గురై నట్లు తేలింది . 

జగ్గయ్యపేట సమీపంలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాప్ లలో వివరాలు అప్ లోడ్ చేయడంపై అవగాహన లేక సహచర ఉపాధ్యాయుడికి ఆ బాధ్యత చూడాలని కోరారు . తానెందుకు అప్లోడ్ చేయాలని ఆ ఉపాధ్యాయుడు , ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది . సహచరులు కలగ జేసుకుని పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది . 

తొలి గంట నుంచే తిప్పలు 

 •  విద్యా శాఖ ప్రవేశ పెట్టిన వివిధ యాల్లో వివరాలు నమోదు చేయడానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు సహకరించక ప్రధానోపా ధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు .
 •  పాఠశాలను ఉన్నతంగా తీర్చి దిద్దడంలో వారి పాత్ర కీలకం . 
 • కానీ ప్రస్తుతం వారు దానిపై దృష్టి సారించలేకపోతున్నారు . 
 • పాఠాల బోధన కంటే యాప్ ల  పైనే ఎక్కువ సమయం కేటా యించాల్సి వస్తోందని వాపోతున్నారు . 
 • ఉదయం బడికి రాగానే బయోమెట్రిక్ వేయాలి. 
 • సర్వర్ సక్రమంగా పనిచేయక తొలి గంటలోనే ఇబ్బందులు ప్రారంభమవుతు న్నాయి . 
 • మొదటి పిరియడ్ లోపు విద్యార్థుల హాజరు తీసుకొని యాప్లో పొందుపరచాలి 
 •  ఆ ప్రక్రియ గడువులోగా పూర్తి కావడం లేదు

బోధనకు ఇబ్బందులెన్నో 

 • ఐఎంఎంఎస్ యాప్లో మధ్యాహ్న భోజన వివరాలు పొందుపరచాలి . 
 • తనిఖీ విభా గంలో వంట గది ప్రదేశం , సరకులు నిల్వ ప్రాంతం , పాత్రలు , చెత్త డబ్బా , విద్యార్థులు తినే ప్రదేశం , మంచినీటి సౌకర్యం , మరుగుదొడ్ల నిర్వహణ , చేతుల శుభ్రత , కోడి గుడ్లు ఇస్తు న్నారా ? లేదా ? వంటి ఫొటోలను అప్లోడ్ చేయాలి . 
 • ఎడ్యుకేషన్ సెక్రటరీలు , ఎఎంసీలు , సీఆర్పీలకు అప్ లోడ్ చేసిన ఫొటోలను , అంశా లను వివరించాలి.
 • పరీక్షా ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేయాలి
 • పాఠశాల ముగిసిన తరువాత ఇన్ - ఔట్ ఉపాధ్యాయుల హాజరు వివరాలను పొందుపర చాలి. 
 • అమ్మ ఒడి , జగనన్న విద్యా కానుక సమా చారం కూడా నిక్షిప్తం చేయాలి. 
 • జగనన్న విద్యాదీవెన కిట్లకు విద్యార్థుల తల్లులతో వేలి ముద్రలు తీసుకోవాలి.
 • ఎంఈవో , డీవై ఈవో , విజిలెన్సు అధికా రులు వచ్చినప్పుడు యాప్లు వినియోగిస్తున్న తీరును వివరించాలి.
 • నాడు నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లో ఈ యాప్ల వినియోగం ప్రధానో పాధ్యాయులకు మరింత తలనొప్పిగా మారింది . 
 • వాటితో పాటు విద్యార్థుల తల్లిదండ్రు లకు సమాధానం చెప్పడం , పాఠశాల నిర్వహణ నిత్యకృత్యమే . 
 • ఆయా యాల్లో సమాచారం పెట్టకపోతే ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ అవుతున్నాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు . 
 • పాఠశా లలు ఆలస్యంగా ప్రారంభం కావడం , సిలబస్ పూర్తి కాకపోవడం వంటి అంశాలతో సతమత మవుతుంటే ఈ యాప్ల వినియోగంతో ఉపా ధ్యాయులు మరింత కుంగిపోతున్నారు .

 ఒకరే ఉన్న చోట ...

 జిల్లాలో అన్ని రకాల పాఠశాలలు మూడు వేల పైగా ఉండగా ... అందులో ప్రస్తుతం 500 ఏకోపాధ్యాయ బడులు ఉన్నాయి . ఆ ఉపాధ్యా యులు విద్యార్థులకు పాఠాలను బోధించేందుకు సమయం సరిపోవడం లేదు . ఇద్దరు ఉన్న చోట సైతం యాప్లను వినియోగించడం కష్టంగా ఉందని , విద్యాశాఖ అధికారులు స్పందించి పని భారం తగ్గించాలని ఉపాధ్యా యులు కోరుతున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "No rest to Teacher "

Post a Comment