Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Pay terminated pensions with 6% interest

నిలిపేసిన పెన్షన్లను 6% వడ్డీతో చెల్లించండి

Pay terminated pensions with 6% interest

జీవో 152 రద్దు చేస్తున్నాం

హైకోర్టు తీర్పు

ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం 2019 నవంబర్ 25వ తేదీన జారీచేసిన జీవో 152 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నందున దాన్ని

రద్దు చేస్తున్నట్లు హైకోర్టుధర్మాసనం తీర్పునిచ్చింది. చట్ట నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వులు భావితం చేయదగినవి కావని తేల్చి చెప్పింది. 1980 నాటి సవరించిన పెన్షన్ నిబంధనలే చట్టబద్ధమైనవని, ఈ ప్రకారం వితంతు కుమార్తెలు, విడాకులు తీసుకున్న కూతుళ్లు పెన్షన్ పొందేందుకు ఎలాంటి షరతులులేవని గుర్తుచేసింది. వీటిని కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా మార్చేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. పదవీ విరమణ అనంతరం ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలు కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులుగా గుర్తించాల్సిందే అని ఆదేశించింది. పదవీ విరమణ అనంతరం ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె వితంతువు అయినా, విడాకులు తీసుకున్నా వారికి కుటుంబ పెన్షన్ ఇచ్చే విషయంలో నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం 2019లో జీవో 152 జారీ చేసింది. కుమార్తెల వయో పరిమితిని 45 ఏళ్లుగా నిర్దేశించింది వితంతు, విడాకులు తీసుకున్న మహిళలు తిరిగి వివాహం చేసుకునేంత వరకు లేదా సంపాదన మొదలుపెట్టే వరకు లేదా ఆమె పిల్లల్లో ఎవరైనా మేజర్ అయ్యేంత వరకు లేదా ఆమె మరణించేంత వరకు కుటుంబ పెన్షన్ వర్తిస్తుందని జీవో చెప్తోంది. ఈ జీవో ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురికి పెన్షన్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన అనంతరం సింగిల్ జడ్జి జస్టిస్ మల్లవోలు సత్యారాయణ మూర్తి తుది తీర్పు వెలువరించారు. పెన్షన్ వయసు 45 సంవత్సరాలుగా పేర్కొనటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఆ కారణంగా పెన్షన్ నిలిపివేయటం సమజంసం కాదన్నారు. వయో భారం పైబడిన కొద్దీ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక అవసరాలు అధికమవుతాయని 45 ఏళ్లలోపు, దాటిన వితంతు, విడాకులు తీసుకున్న మహిళల విషయంలో వివక్షత తగదని హితవు పలికింది. జీవో జారీకి ముందు అధికారులు క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదని వర్గీకరణలో ఎంతమాత్రం హేతుబద్ధతలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పెన్షన్ జీవించే హక్కులో ఓ భాగమని సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో ఉటంకించిందని గుర్తుచేశారు గతంలో చెల్లించిన విధంగానే కుటుంబ పింఛన్లు చెల్లించాలని ఆదేశించింది నిబంధనల సాకుతో పింఛన్ నిలిపివేసిన నాటి నుంచి 6 శాతం వడ్డీతో కలిపి అందించాలని రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి ఉత్తర్వులిచ్చారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Pay terminated pensions with 6% interest"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0