Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Restaurant Guidelines: Alert for those who go to restaurants .. Corona's new guidelines released by the centeral Government

 Restaurant Guidelines: రెస్టారెంట్లకు వెళ్లే వారికి అలర్ట్.. కేంద్రం విడుదల చేసిన కరోనా నూతన మార్గదర్శకాలివే.

Restaurant Guidelines: Alert for those who go to restaurants .. Corona's new guidelines released by the centeral Government

అన్ లాక్ అనంతరం చాలా మంది ఇప్పుడిప్పుడే తమకు ఇష్టమైన రెస్టారెంట్లకు వెళ్తూ రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే తాజాగా కేంద్రప్రభుత్వం కరోనా వ్యాప్తి జరగకుండా రెస్టారెంట్ల కోసం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.

కరోనా లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికి తెలిసిందే.  ఆ దెబ్బకు స్కూళ్లు, మాల్స్, ఆఫీసులు అన్నీ మూత పడ్డాయి. దశలవారీగా తగిన కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వచ్చేస్తున్నాం. పాఠశాలలు, కార్యాలయాలు, మాల్స్, హోటళ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే పూర్వ స్థితికి చేరుకుంటున్నాం. ఇప్పటికే చాలా మంది తమకు ఇష్టమైన రెస్టారెంట్లలో రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే తాజాగా కేంద్రప్రభుత్వం కరోనా వ్యాప్తి జరగకుండా రెస్టారెంట్ల కోసం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని మైగవ్ ఇండియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. "మీకు ఇష్టమైన రెస్టారెంట్‌లో కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని ఆస్వాదించడానికి ఎదురుచూస్తున్నారా? కోవిడ్ జాగ్రత్తలను అనుసరించడం మర్చిపోవద్దు! 1 మార్చి 2021 నుండి కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాల ఇవిగో" అంటూ.. #IndiaFightsCorona అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్లో ప్రకటనను పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో నూతన మర్గదర్శకాలు.

రెస్టారెంట్లలో కోవిడ్ నూతన మార్గదర్శకాలు..

  • డైన్ -ఇన్(రెస్టారెంట్లోనే తినడం)కు బదులుగా టేక్ అవే(ఇంటికి తీసుకెళ్లడం)ని ప్రోత్సహించండి. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆహార పంపిణీ సక్రమంగా చేయాలి.
  • ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్ డిస్పెన్సర్, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా ఉండాలి.
  • కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే లోపలకు అనుమతించాలి.
  • రెస్టారెంట్లోని సిబ్బంది అంతా మాస్కులు, కవర్లు ధరించడం తప్పనిసరి. లోపల ఉన్నంత సేపు వీటిని తీయకూడదు.
  • అదనపు సీటింగ్ సామర్థ్యంతో పాటు వెయిటింగ్ ప్రదేశం ఏర్పాటు చేసి సామాజిక దూరం నిబంధనలు పాటించాలి.
  • వినియోగదారులు, సిబ్బంది కోసం, అలాగే వారి వస్తువులు, సామాగ్రి కోసం ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్లు ఉండేలా చూడాలి.
  • రెస్టారెంట్ లోపల క్యూలో కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని నిర్వహించాలి.
  • తగినంత భౌతిక దూరం ఉండే విధంగా సీటింగ్ అరెంజ్ మెంట్ ఉండాలి.
  • డిస్పోజబుల్ మెనూలు, నాణ్యత గల కాగితపు న్యాప్ కిన్స్ ఉపయోగించాలి.
  • సామాజిక దూరం పాటించేలా వినియోగదారులకు బఫే సర్వీస్ ఉండాలి.
  • ఎలివేటర్లలో వ్యక్తుల సంఖ్య పరిమితం చేయాలి. భౌతిక దూరం పాటించాలి.
  • ప్రత్యామ్నాయ దశల్లో ఒక వ్యక్తితో కూడిన ఎస్కలేటర్లను ఉపయోగించాలి.
  • సంబంధిత రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం విధానాలకు అనుగుణంగా సమావేశాలు, భేటీలు నిర్వహించాలి.
  • కాంటాక్ట్ లెస్ మోడ్ ఆఫ్ ఆర్డర్, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Restaurant Guidelines: Alert for those who go to restaurants .. Corona's new guidelines released by the centeral Government"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0