Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI: Alert for SBI customers ... Bank services interrupted for two days

 SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... రెండు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం

SBI: Alert for SBI customers ... Bank services interrupted for two days

Bank Strike  మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? బ్యాంకుకు వెళ్లాల్సిన పని ఉందా? ఏవైనా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు జరపాలా? అయితే అలర్ట్. బ్యాంకింగ్ సేవలకు రెండు రోజులు అంతరాయం కలిగే అవకాశం ఉంది.

బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు మార్చి 15, 16 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మెను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం కలగొచ్చొని స్టాక్ ఎక్స్‌ఛేంజీలకు సమాచారం ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. కాబట్టి రాబోయే వారం రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం తప్పదు. మార్చి 11 గురువారం శివరాత్రి సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఇక బ్యాంకులు పనిచేసేది మార్చి 12 శుక్రవారం మాత్రమే. ఆ తర్వాత బ్యాంకులు రెండు రోజులు మూసి ఉంటాయి. మార్చి 13న రెండో శనివారం, మార్చి 14 ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవే. ఇక మార్చి 15, 16 తేదీల్లో సమ్మె కారణంగా బ్యాంకుల్లో కార్యకలాపాలకు అంతరాయం తప్పదు. అంటే మార్చి 12 తర్వాత బ్యాంకుల్లో యథావిధిగా సేవలు లభించేది మార్చి 17 నుంచే. కాబట్టి ఖాతాదారులు, బ్యాంకుల్లో లావాదేవీలు జరపాలనుకునేవారు ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే ఈ సెలవులకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం అవసరం.

రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్-UFBU ఆధ్వర్యంలోనే తొమ్మిది యూనియన్లు సమ్మె నిర్వహించబోతున్నట్టు ఇండియన్అసోసియేషన్-IBA ప్రకటించింది. ఈ సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్-AIBEA, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్-AIBOC, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్-NCBE, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్-AIBOA, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-BEFI, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కెనెరా బ్యాంక్ ఎంప్లాయీస్ కాంగ్రెస్-INBEF, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్-INBOC, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్-NOBW, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్-NOBO, ఆల్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ కెనెరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్-AINBOF ఈ సమ్మెలో పాల్గొంటాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని ప్రకటించారు. ఈ ప్రతిపాదనను బ్యాంకు యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. అందుకే సమ్మెను ప్రకటించాయి. ఇక ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకులో మెజార్టీ వాటాను 2019లో ఎల్ఐసీ చేజిక్కించుకుంది. గత నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనమయ్యాయి. మరోవైపు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI: Alert for SBI customers ... Bank services interrupted for two days"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0