Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Annuity Scheme: If you join this scheme, money will be credited to your account every month ... Scheme details

SBI Annuity Scheme: ఈ స్కీమ్‌లో చేరితే ప్రతీ నెల అకౌంట్‌లోకి డబ్బులు... స్కీమ్ వివరాలివే.

SBI Annuity Scheme: If you join this scheme, money will be credited to your account every month ... Scheme details

SBI Annuity Scheme స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అనేక పొదుపు పథకాలను అందిస్తోంది. అందులో యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో చేరితే ప్రతీ నెల మీ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకుందాం.

  • 1. మీ దగ్గర ఉన్న డబ్బు పొదుపు చేసి ప్రతీ నెలా ఖర్చులకు కొంత మొత్తం పొందాలనుకుంటున్నారా? ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటే ప్రతీ నెల డబ్బులు పొందొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI పలు డిపాజిట్ స్కీమ్స్ అందిస్తోంది. అందులో యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ఒకటి.
  • 2. ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటే ప్రతీ నెల కొంత మొత్తాన్ని పొందొచ్చు. ఈ స్కీమ్‌లో ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 3 ఏళ్లు, 5 ఏళ్లు, 7 ఏళ్లు, 10 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయొచ్చు. జమ చేసిన మొత్తంపై ప్రతీ నెల కస్టమర్లు ఎంత కోరితే అంత బ్యాంకు డిపాజిట్ చేస్తుంది.
  • 3. బ్యాంకు డిపాజిట్ చేసే డబ్బులో కొంత అసలు ఉంటుంది, ఇంకొంత వడ్డీ ఉంటుంది. ప్రతీ నెల అసలు, వడ్డీ ఎంత వస్తుందన్నది కస్టమర్ డిపాజిట్ చేసే మొత్తం, ఎంచుకునే కాలం, ప్రతీ నెల కోరుకునే మొత్తంపై ఆధారపడి ఉంటుంది.
  • 4. ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌లో ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. మైనర్లు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇందులో కనీసం రూ.36,000 డిపాజిట్ చేయాలి. మూడేళ్ల కాలానికి రూ.36,000 డిపాజిట్ చేస్తే నెలకు రూ.1,000 చొప్పున లభిస్తుంది. డబ్బులు డిపాజిట్ చేయడానికి గరిష్ట పరిమితి లేదు.
  • 5. ఇక వడ్డీ రేట్ల విషయానికి వస్తే ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఎంత వడ్డీ అందిస్తుందో ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌కు అవే వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ప్రస్తుతం 5 ఏళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 5.30%, ఐదు నుంచి పదేళ్ల కాలానికి 5.40% వడ్డీని ఇస్తోంది ఎస్‌బీఐ. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ అంటే అరశాతం వడ్డీ అదనంగా వస్తుంది. ఎస్‌బీఐ సిబ్బంది, ఎస్‌బీఐ పెన్షనర్లకు 1 శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది.
  • 6. ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌లో నామినేషన్ సదుపాయం ఉంది. ఓవర్‌డ్రాఫ్ట్ లేదా లోన్ కూడా తీసుకోవచ్చు. యాన్యుటీ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. ఒకవేళ లోన్ తీసుకుంటే యాన్యుటీ అమౌంట్ లోన్ అకౌంట్‌లోకి వెళ్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Annuity Scheme: If you join this scheme, money will be credited to your account every month ... Scheme details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0