Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Recruitment-2021: 8500 Apprentices Exam Date Delayed and Latest Updates Here

 SBI Apprentice 2021: ఎస్‌బీఐలో అప్రెంటీస్ అభ్యర్థులకు అలర్ట్... అడ్మిట్ కార్డ్ వివరాలు.

SBI Apprentice 2021: Alert for Apprentice candidates in SBI ... Admit Card Details.

SBI లో 8500 అప్రెంటిస్‌ జాబ్స్‌ పరీక్ష విధానం, అడ్మిట్‌ కార్డ్‌ విడుదల తేదీ వివరాలు ఇవే

SBI Apprentice Recruitment 2020: వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. అయితే.. రాతపరీక్ష, స్థానిక భాషలో పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది. 


ఎస్‌బీఐలో 8500 అప్రెంటిస్‌ ఖాళీలు

ఏప్రిల్‌లో రాత పరీక్షలు నిర్వహించే ఛాన్స్‌

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా 8500 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో తెలంగాణకు 460, ఆంధ్రప్రదేశ్‌కు 620 పోస్టుల్ని కేటాయించింది. అయితే వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. అయితే.. రాతపరీక్ష, స్థానిక భాషలో పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది. 

ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు జనవరిలోనే జరగాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు కూడా ఇంకా రిలీజ్ కాలేదు. మార్చి చివరి వారంలో అడ్మిట్‌ కార్డులను రిలీజ్ చేయనుంది. ఇక ఏప్రిల్ మొదటివారం లేదా రెండోవారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్‌ కార్డులు, ఇతర వివరాల కోసం LINK1 లేదా LINK2 వెబ్‌సైట్‌లు ఫాలో కావాలి. 

పరీక్ష విధానం, సిలబస్‌

ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ టాపిక్స్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు, క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. 

ప్రతీ సెక్షన్‌కు 15 నిమిషాల చొప్పున పరీక్ష 60 నిమిషాలు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటాయి. నెగిటీవ్ మార్కులు ఉంటాయి. అంటే ప్రతీ తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. 

ఈ పరీక్షలో రాష్ట్రాల వారీగా, కేటగిరీల వారీగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. స్థానిక భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం తప్పనిసరి. ఇవే అంశాలపై లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. లాంగ్వేజ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి అప్రెంటిస్‌ అవకాశం కల్పిస్తారు.అడ్మిట్ కార్డుల వివరాల కోసం ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్స్ https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/web/careers ఫాలో కావాలి. ఇదే వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేయొచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Recruitment-2021: 8500 Apprentices Exam Date Delayed and Latest Updates Here"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0