Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

These foods should be taken to keep the body cool during the summer ..!

 వేసవి కాలంలో శరీరం చల్లగా ఉండాలంటే ఈ ఆహార పదార్ధాలు తీసుకోవాలట .. !

These foods should be taken to keep the body cool during the summer ..!

మండుతున్న ఎండలలో మన శరీరాన్ని కాపాడుకోవాలి అంటే, మన శరీరం లోపల నుంచి చల్లగా ఉండాలి. అందుకోసం ఎక్కువ నీటిని తాగడం, పండ్ల రసాలను సేవించడం లాంటివి చేస్తూ ఉండడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. అయితే మనలో చాలామంది ఎండాకాలం నుంచి బయట పడాలి అంటే, ముఖ్యంగా వేసవి కాలంలో ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు కొన్ని చిట్కాలను మీ ముందుకు తీసుకు వచ్చాము. ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల ఎలాంటి వేసవి కాలం నుంచి అయిన ఇట్టే బయటపడవచ్చు.

పుచ్చకాయలు,కర్బూజ :
ఈ రెండింటిలోనూ నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.
అంతేకాకుండా శరీరంలో ద్రవాలు సమతుల్యం అవుతాయి. పోషకాలు లభిస్తాయి. డీ హైడ్రేషన్ బారినపడకుండా ఉంటారు. అంతేకాకుండా వేసవి తాపం నుంచి బయట పడాలి అంటే ఈ పుచ్చకాయలు, కర్బూజాలు నిత్యం తినడం అలవాటు చేసుకోవాలి. అపుడే శరీర ఉష్ణోగ్రత సరైన స్థాయిలో ఉంటుంది.
పెరుగు:
పెరుగు అలాగే పెరుగును బాగా చిలికిన తర్వాత వచ్చే పల్చటి మజ్జిగ శీతల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వేసవికాలంలో పెరుగు నిత్యం తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి, అలాగే బీపి కంట్రోల్ లో ఉండటానికి, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక జీర్ణక్రియ కూడా సవ్యంగా జరుగుతుంది. గుండె, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.
కీరదోస :
కీరదోస మనకు వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఈ సీజన్లో దీనిని ఎక్కువగా తీసుకోవాలి.ముఖ్యంగా సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇందులో నీటిశాతం అధికంగా ఉండడం వల్ల ఎండ వల్ల కోల్పోయిన ద్రవాలను దీంతో భర్తీ చేసుకోవచ్చు. ఫలితంగా వడదెబ్బ, ఎండ దెబ్బ వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. శరీర ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుంది. మన శరీరానికి అవసరమైన పోషకాలు అధికంగా లభిస్తాయి..
పుదీనా, నిమ్మరసం :
పుదీనా నిమ్మరసం కూడా మనకు తాజాదనంతో పాటు చల్లదనాన్ని చేకూరుస్తాయి . పుదీనా ను తినడం వల్ల మంచి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నిమ్మరసం కూడా మన శరీరానికి కావలసిన తాజాదనాన్ని అందించడంతో పాటు తగిన తేమను కూడా అందిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "These foods should be taken to keep the body cool during the summer ..!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0