Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Transferred your money to another account incorrectly? But reverse that amount!

 మీ డబ్బును తప్పుగా ఇతర ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశారా.? అయితే ఆ మొత్తాన్ని రివర్స్ చేసుకోండిలా.!

Transferred your money to another account incorrectly? But reverse that amount!

Transferred Money to a Wrong Account: మీరు తరచూ ఆన్‌లైన్ బ్యాంక్ ట్రాన్సక్షన్స్ చేస్తుంటారా.? అలాగే హడావుడిగా ఎప్పుడైనా తప్పుడు నెంబర్ టైప్ చేయడం ద్వారా వేరే అకౌంట్‌లోకి నగదు బదిలీ చేశారా.? అయితే టెన్షన్ పడకండి ఈజీగా ఆ డబ్బును మరలా మీ అకౌంట్‌కు క్రెడిట్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..!

ఈ రోజుల్లో ఆన్‌లైన్ డబ్బు బదిలీలు సర్వసాధారణం అయిపోయాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ), పేటిఎమ్, నెట్ బ్యాంకింగ్, ఫోన్ పే, గూగుల్ పే వంటి ఎన్నో రకాల థర్డ్ పార్టీ నగదు లావాదేవీల యాప్స్ అందుబాటులోకి రావడంతో.. బ్యాంకులకు వెళ్లకుండానే జనాలు డబ్బును ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు.

ఈ ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి.

ఉదాహరణకు, మీరు అనుకోకుండా డబ్బును వేరొకరి ఖాతాకు బదిలీ చేస్తే, ఆ నగదును మళ్లీ ఎలా తిరిగి పొందగలరు? ఆ మొత్తాన్ని తిరిగి మీ ఖాతాలోకి క్రెడిట్ చేసే అధికారం బ్యాంకుకు ఉందా? ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. తప్పుగా వేరే అకౌంట్‌లోకి క్రెడిట్ అయిన మొత్తాన్ని తిరిగి రివర్స్ చేసే అధికారం బ్యాంకులకు లేదు.

ఎప్పుడైతే లబ్దిదారుడు.. బాధితుడిపై దయతలిస్తే తప్ప.. బ్యాంకులకు ఆ డబ్బును తిరిగి రివర్స్ చేసే అధికారం, అనుమతి లభించదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ట్రాన్సక్షన్లలో బ్యాంక్ కేవలం ఫెసిలిటేటర్‌గా మాత్రమే పనిచేయగలదని bankbazaar.com సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అధిల్ శెట్టి వెల్లడించినట్లు ఓ ప్రముఖ పోర్టల్ కథనాన్ని ప్రచురించింది.

మరి బదిలీ అయిన మొత్తాన్ని ఎలా తిరిగి క్రెడిట్ చేసుకోవచ్చు.?

పొరపాటున మీరు డబ్బును క్రెడిట్ చేయాల్సిన అకౌంట్ కాకుండా వేరే ఖాతాలోకి క్రెడిట్ చేస్తే.. తక్షణం మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి విషయాన్ని అంతా వివరించండి. లావాదేవీ జరిగిన ఖచ్చితమైన సమయం, తేదీతో పాటు, నగదు తప్పుగా బదిలీ అయిన ఖాతా నంబర్‌ను కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు చెప్పండి. దీనితో మీరు తప్పుగా ఎంటర్ చేసిన ఖాతాకు బదిలీ అయిన సొమ్ము 5-6 పనిదినాల్లో తిరిగి మీ అకౌంట్‌కు క్రెడిట్ అవుతుంది.

ఒకవేళ అది జరగకపోతే.. మీరు మీ బ్యాంకును సంప్రదించి, తప్పుగా జరిగిన లావాదేవీల గురించి మేనేజర్‌కు తెలియజేయాలి. సదరు బ్యాంక్ డబ్బు బదిలీ అయిన లబ్ధిదారుడి వివరాలను తనిఖీ చేసి.. ఆ వ్యక్తికి అదే శాఖలో ఖాతా ఉంటే.. నగదు విషయమై అభ్యర్థిస్తుంది. కొన్నిసార్లు బ్యాంకులు ఇలాంటి లావాదేవీలను సెటిల్ చేయడానికి రెండు నెలల సమయాన్ని కూడా తీసుకుంటాయి.

లబ్ధిదారుడు.. మీ ఖాతాకు డబ్బును తిరిగి క్రెడిట్ చేయడానికి నిరాకరిస్తే..?

ఈ సందర్భంలో, మీరు మీ బ్యాంకును సంప్రదించి మొత్తం విషయాన్ని వివరించండి. అతను లేదా ఆమె మీ డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఒకవేళ మీ బ్యాంక్, లబ్ధిదారుడి బ్యాంక్ వివిధ ప్రాంతాల్లో ఉంటే మాత్రం ఈ ప్రక్రియ మరింత కష్టతరం అవుతుంది.

మీ డబ్బును తిరిగి ఇవ్వడానికి లబ్ధిదారుడు అంగీకరిస్తే..?

ఆ డబ్బును తిరిగి మీ ఖాతాలోకి క్రెడిట్ చేసుకోవడానికి 8-10 పనిదినాలు పడుతుంది. లేకపోతే, మీరు లావాదేవీని ఖచ్చితమైన బ్యాంక్ స్టేట్మెంట్, చిరునామా, ఐడి ప్రూఫ్ మొదలైన వాటితో నిరూపించాల్సి ఉంటుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Transferred your money to another account incorrectly? But reverse that amount!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0