Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

1. Is there any use of the vaccine? Or not?

  1.వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఉందా? లేదా?

1. Is there any use of the vaccine?  Or not?


1.వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఉందా? లేదా?

జ.: ఉంది.

వ్యాక్సిన్ వేసుకోని వారికి కరోనా సోకితే... అది వారంలోపే తీవ్రంగా అవుతుంది. మరణం కూడా రావచ్చు. అదే వ్యాక్సిన్ వేయించుకున్న వారికి తీవ్రం అవ్వడానికి 10 నుంచి 12 రోజులు పడుతుంది. ఈలోగా ఆస్పత్రిలో చేరిపోయి ప్రాణాలు కాపాడుకోవచ్చు. అంతేకాదు వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కరోనా సోకితే... అది ఊపిరితిత్తులను చేరడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఈలోగా చక్కటి ట్రీట్‌మెంట్ పొందవచ్చు.


*2.వ్యాక్సిన్ బాడీలోకి వెళ్తే ఏమవుతుంది? జ్వరం ఎందుకు వస్తుంది?*

జ.: వ్యాక్సిన్ వేసుకున్న వారికి జ్వరం వస్తే... అది పనిచేస్తున్నట్లు లెక్క. అంటే... మన శరీరంలో యాంటీబాడీలు ఉంటాయి. అవి బయటి నుంచి ఏ వైరస్‌లు, బ్యాక్టీరియాలూ రాకుండా అడ్డుకుంటాయి. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు... బయటి నుంచి వచ్చే వ్యాక్సిన్ మూలకాలతో... యాంటీబాడీలు యుద్ధం చేస్తాయి. యుద్ధంలో గెలవడానికి అవి తమ సంఖ్యను పెంచుకుంటాయి. దాంతో... వేడి పుడుతుంది. దాన్నే మనం జ్వరం అంటారు. ఇలా వేడి పుట్టినప్పుడు... బాడీలో యాంటీబాడీల సంఖ్య బాగా పెరుగుతుంది. మనం జ్వరాన్ని పారాసిటమాల్ టాబ్లెట్‌తో తగ్గించుకున్నాక... ఆల్రెడీ పెరిగిన యాంటీబాడీలు అక్కడే గూడు కట్టుకొని ఉంటాయి. అవి ఉండగా కరోనా వైరస్ బాడీలోకి వస్తే... వెంటనే దాడి చేసి చంపుతాయి. అందుకే మనం వ్యాక్సిన్ వేసుకోవాలి. తద్వారా యాంటీబాడీలను బాగా పెంచుకోవాలి.


*3.వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డకడుతోందా?*

జ.: దీనిపై స్పష్టత లేదు. కోవిషీల్డ్ (Covishield) వ్యాక్సిన్ వల్ల విదేశాల్లో కొంత మందికి రక్తం గడ్డకడుతోంది అనే ప్రచారంతో... కొంతమంది భారతీయులు ఆ వ్యాక్సిన్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. కానీ ఇండియాలో ఇప్పటివరకూ ఒక్కరికి కూడా అలా జరగలేదు. కాబట్టి ఇండియాలో ఏ భయమూ లేకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి.


*4.వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా సోకుతుందా?*

జ.: సోకుతుంది. అసలు వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా శరీరంలోకి ముక్కు, నోరు, కళ్ల ద్వారా కరోనా వెళ్లగలదు. తీరా లోపలికి వెళ్లాక... లోపల పెద్ద సంఖ్యలో (వ్యాక్సిన్ వేయించుకుంటే) యాంటీ బాడీలు ఉంటాయి. వాటిని చూడగానే కరోనా వైరస్ సగం చచ్చిపోతుంది. ఇక యుద్ధం చేశాక... పూర్తిగా చస్తుంది. ఆ యుద్ధం ఓ 12 రోజులు జరుగుతుంది. ఈలోగా మనం ఆస్పత్రికి వెళ్లి... మరింతగా యాంటీబాడీలను పెంచేసుకుంటే సరిపోతుంది


*5.వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్న కరోనా సోకుతుందా?*

జ.: సోకుతుంది. 4వ ప్రశ్నలో చెప్పినట్లే జరుగుతుంది. ఐతే... 2 డోసులు వేసుకున్న వారికి యాంటీబాడీలు మరింత ఎక్కువగా ఉంటాయి. అందువల్ల యుద్ధం 5 లేదా 6 రోజుల్లోనే అయిపోతుంది. ఈ యుద్ధంలో కరోనా ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.


*6.ఓవరాల్‌గా వ్యాక్సిన్ వేసుకోవడమే మంచిదా?*

జ.: అవును. మనం ఎలాంటి డౌట్లూ లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడమే మంచిది. తద్వారా మనల్ని మనం కాపాడుకుంటాం. మన ద్వారా ఇతరులకు కరోనా సోకకుండా కాపాడినవాళ్లం అవుతాం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "1. Is there any use of the vaccine? Or not?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0