Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The AP cabinet will meet on May 29 to discuss issues.

ఈనెల 29న AP కేబినెట్ భేటీ కానుంది చర్చించబోవు అంశాలు.

The AP cabinet will meet on May 29 to discuss issues.


అమరావతి: ప్రస్తుత కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి సమావేశం కానుంది. ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఈ భేటి జరగనుంది. వేగంగా వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ను ఎలా కట్టడి చేయాలన్న దానిపైన ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయడంపైనా చర్చ ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే కరోనా రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపైనా చర్చించనున్నారు. ఆక్సిజన్ సరఫరా, బెడ్స్, రెమిడిసివర్ కొరత వంటి అంశాలపై చర్చించే అవకాశముంది.

ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే వున్నాయి.

దీంతో రోగులు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. అయితే ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత వేధిస్తోంది. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,434 మందికి కరోనా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 10,54,875కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు కరోనా కారణంగా 64 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి రాష్ట్రంలో వైరస్ వల్ల ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 7,800కు చేరుకుంది.

గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా విజయనగరంలో 8, అనంతపురం 6, తూర్పుగోదావరి 6, గుంటూరు 6, నెల్లూరు 6, శ్రీకాకుళం 6, చిత్తూరు 5, కర్నూలు 4, ప్రకాశం 4, విశాఖపట్నం 4, పశ్చిమ గోదావరి 4, కృష్ణ 3, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కోవిడ్ నుంచి 7,055 మంది కోలుకున్నారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,47,629కి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 99,446గా వుంది.

గత 24 గంటల వ్యవధిలో 74,435 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,61,43,083 కి చేరుకుంది. నిన్న అనంతపురం 702, చిత్తూరు 1982, తూర్పోగోదావరి 253, గుంటూరు 2028, కడప 271, కృష్ణ 544, కర్నూలు 474, నెల్లూరు 1237, ప్రకాశం 497, శ్రీకాకుళం 1322, విశాఖపట్నం 1067, విజయనగరం 633, పశ్చిమ గోదావరిలలో 424 కేసులు చొప్పున నమోదయ్యాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The AP cabinet will meet on May 29 to discuss issues."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0