Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

337 Jobs in IGCAR

IGCARలో 337 ఉద్యోగాలు

337 Jobs in IGCAR


ఇతర వివరాలు: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన కల్పక్కం(తమిళనాడు)లోని ఇందిరా గాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రీసెర్చ్‌ (ఐజీసీఏఆర్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 337 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను సంబంధించిన విద్యార్హతలు, విభాగాలు తదితర ముఖ్యమైన విషయాలు http://www.igcar.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

1. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌: 98 

పోస్టులు: సైంటిఫిక్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, టెక్నీషియన్‌, స్టెనోగ్రాఫర్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌, సెక్యూరిటీ గార్డ్‌, వర్క్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులున్నాయి. 

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండి.. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ (స్టెనోగ్రఫీ, ఫిజికల్‌ టెస్ట్‌ , డ్రైవింగ్‌), అడ్వాన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

2. స్టయిపెండరీ ట్రెయినీ కేటగిరీ-1: 68 

విభాగాలు: కెమికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

3. స్టయిపెండరీ ట్రెయినీ కేటగిరీ-2: 171 

ట్రేడ్స్‌: డ్రాఫ్ట్‌మెన్‌(మెకానికల్‌), ఫిట్టర్‌/రిగ్గర్‌, ప్లంబర్‌, వెల్డర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ మొదలైన ట్రేడ్స్‌లో ఈ ఖాళీలున్నాయి. 

అర్హత: 60 శాతం మార్కులతో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథ్స్‌, సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌ల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్‌, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ:14.05.2021 

దరఖాస్తు కు చివరి తేదీ:  20.05.2021 

హార్డు కాపీలను పంపాల్సిన చిరునామా: అసిస్టెంట్‌ పర్సనల్‌ ఆఫీసర్‌, ఐజీసీఏఆర్‌, కల్పక్కం - 603102 

వెబ్‌సైట్‌: http://www.igcar.gov.in/ 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "337 Jobs in IGCAR"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0