Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About 10th Class Examinations

పది పరీక్షలపై రేపు కీలక ప్రకటన

About 10th Class Examinations


కరోనా తీవ్రతపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్ణయం తీసుకోనున్న ముఖ్యమంత్రి

 రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే సీబీఎస్ఈతో పాటు తెలంగాణ, పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఉన్నత స్థాయి సమీక్షలో కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యాసంస్థల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో వాటి కొనసాగింపుపైనా చర్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థులు, బోధనా సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. అలాగే నిత్యం కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇదిలా ఉంటే గతేడాది లాక్ డౌన్ కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అందువల్ల పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది ఆలస్యంగా జూన్లో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి డా. సురేష్ గతంలోనే షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించాలా లేక పొరుగు రాష్ట్రాల్లోలా రద్దు చేయాలా అనే అంశంపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించి, ఒక నిర్ణయం ప్రకటించనున్నట్లు 

టెన్త్ పరీక్షలపై ఉత్కంఠ

  • రేపు విద్యాశాఖాధికారులతో సీఎం జగన్ 
  • ఉన్నతస్థాయి సమీక్ష
  • తేలనున్న విద్యార్థుల భవితవ్యం
  • ముఖ్యమంత్రి నిర్ణయమే కీలకం
  • రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా కేసులు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే సీబీఎస్ఈతో పాటు తెలంగాణ ప్రభుత్వం.... కూడా పదో తరగతి పరీక్షలు రద్దుచేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది. కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తక్షణం ప్రకటించక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. అదే సమయంలో పాఠశాలల నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఏపీలో ప్రస్తుతం రోజుకు ఆరువేల కొత్త కరోనా కేసులు బయటపడుతున్నాయి. పలు జిల్లాల్లో కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలు, పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ ప్రభావం ప్రధానంగా పదో తరగతి పరీక్షలపై పడుతోంది. వీటి విషయంలో తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకోలేనని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. తాజాగా, కరోనా వ్యాక్సిన్లు విస్తృతంగా వేస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు జూన్ లో జరగాల్సి ఉంది. అయితే, ఇంకా సమయం ఉండటంతో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాలావద్దా అనే దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సీఎం జగన్మోహన్ రెడ్డి నిశితంగా గమనిస్తున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు కరోనావ్యాప్తి అడ్డంకిగా మారిన నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై సీఎం సోమవారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇందులో పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థుల కోసం పాఠశాలలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు దగ్గరపడుతున్న తరుణంలో విద్యార్థులు ఎక్కువ సమయం స్కూళ్లలోనే గడపాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో తల్లితండ్రుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వం కూడా పరీక్షల రద్దుకే మొగ్గుచూపే అవకాశం ఉంది. చివరి నిమిషంలో అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప పరీక్షల రద్దుకే ప్రభుత్వం మొగ్గుచూపవచ్చని తెలుస్తోంది. ఇదే విషయమై ముఖ్యమంత్రి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా, లాక్డౌన్ విధించకుండా ముందుకుసాగాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో అది సాధ్యమా అనేది తేలాల్సి ఉంది. అయితే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం నిర్ణీత సమయానికి పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About 10th Class Examinations"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0