Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Andhra Pradesh:: Comments on CM Key on Lah. Officers ordered to survey the house.

 Andhra Pradesh : : లాహ్ పై సీఎం కీలక పై వ్యాఖ్యలు . ఇంటింటి సర్వే చేయాలని అధికారులకు ఆదేశం.

Andhra Pradesh:: Comments on CM Key on Lah.  Officers ordered to survey the house.

ఏపీని కరోనా భయపెడుతోంది. ప్రస్తుతం ఒక్కరోజులోనే 5 వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది. ఊహించని స్థాయిలో రోజు రోజుకూ కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. సెకెండ్ వేవ్ లో రెట్టింపు వేగంతో కరోనా పంజా విసురుతోంది. ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులను చూసి ప్రజలు భయపెడుతున్నా? నిర్లక్ష్యం వీడడం లేదు. చాలా చోట్ల ప్రజలు మాస్కులు కూడా ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. దీంతోనే కేసుల సంఖ్య పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ఎక్కడా మార్పు కనిపించడం లేదు. తాజా పరిస్థితిపై సీఎం జగన్ మరోసారి రివ్యూ నిర్వహించారు..


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అధికారులంతా అలర్ట్ గా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించకుండానే కరోనాకట్టడికి తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. వేగంగా పెరుగుతున్న కేసులకు ఎలా అడ్డుకట్ట వేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై ఏపీ సీఎం జగన్‌ అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా అందరికీ కొవిడ్‌ టెస్టులు ప్రతినిత్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వారి అందరికీ ఆర్టీపీసీఆర్‌ పరిక్షలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అర్బన్‌ ప్రాంతాల్లో 62శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం కొవిడ్‌ కేసులు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కేసులు తక్కువగా ఉన్నా మరణాలు పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది అన్నారు. అందుకు ప్రధాన కారణం.. కరోనా సోకిందని గుర్తించడం ఆలస్యం అవ్వడంతో.. అప్పటికే నష్ట జరిపోయిన తరువాత ఆసుపత్రులను ఆశ్రయించడమే మరణాలకు కారణంగా గుర్తించామన్నారు అధికారులు.

దానిపై స్పందించిన సీఎం ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వెంటనే ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలతో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే ఇంటింటి సర్వే చేయడంపై కసరత్తు చేయాలని సూచింరాు. అలాగే ఆస్పత్రుల్లో సీసీటీవీల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను కోరారు. పేద ప్రజలకు నాణ్యమైన భోజనం, శానిటైజేషన్‌పై దృష్టి సారించాలన్నారు.

మరోవైపు ఏపీలో కోవిడ్ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్నిపునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కరోనా నివారణ, వ్యాక్సినేషన్‌ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. మొత్తం 21 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్సులో సీనియర్ ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రవిచంద్ర, పీయూష్‌కుమార్‌, బాబు.ఎ, మల్లికార్జున్‌, విజయరామరాజు, అభిషేక్‌ మహంతి, శ్రీకాంత్‌ వంటి అధికారులకు టాస్క్ ఫోర్స్ లో చోటు కల్పించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Andhra Pradesh:: Comments on CM Key on Lah. Officers ordered to survey the house."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0