Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Govt - Microsoft Join Hands to Train 1.60 Crore Students

 విద్యార్థులకు 42 కోర్సుల్లో నైపుణ్య శిక్షణ - 1.60 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం

AP Govt - Microsoft Join Hands to Train 1.60 Crore Students

  • మైక్రోసాఫ్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
  • కోర్సు చేసే ప్రతి విద్యార్థికీ సంస్థ 100 డాలర్ల బహుమతి

ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కళాశాలల విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం  42 కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ సంస్థతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం వర్చువల్‌ విధానంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1.60 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కోర్సులు చేసే ప్రతి విద్యార్థికీ సంస్థ 100 డాలర్ల బహుమతిని, కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్‌ను ఇస్తుంది.

మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి మాట్లాడుతూ ‘దేశంలో డిజిటల్‌ ఎకానమీలో విజయం సాధించాలంటే డిజిటల్‌ నైపుణ్యం అనేది పునాదిగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని యువతలో నైపుణ్యాలకు పదునుపెట్టి మంచి ఉద్యోగావకాశాలు పొందేలా చేయడానికి కృషి చేస్తాం’ అని వెల్లడించారు.

ఏఏ కోర్సుల్లో శిక్షణ

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఏడు రకాల అజ్యూర్‌ టెక్నాలజీ కోర్సులు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, మైక్రోసాఫ్ట్‌ డైనమిక్స్‌ 365, పవర్‌ యాప్‌ ఫండమెంటల్స్‌, అజ్యూర్‌ డేటా అనలిటిక్స్‌, డేటాబేస్‌, తదితర 42 కోర్సులు ఇందులో ఉంటాయి. కోర్సును బట్టి 40 గంటల నుంచి 160 గంటల వ్యవధిలో శిక్షణ ఇస్తారు. దీంతోపాటు ఉద్యోగాల కోసం వెళ్లే ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి. వేష భాషలతోపాటు ఇతర నైపుణ్యాలపైనా శిక్షణ ఇస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "AP Govt - Microsoft Join Hands to Train 1.60 Crore Students"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0