Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona boom in educational institutions

బడుల్లో భయం


  • విద్యా సంస్థల్లో కరోనా విజృంభణ
  • కేసులు బయటపడినా కొనసాగుతున్న తరగతులు
  • పిల్లల్ని పంపేందుకు భయపడుతున్న తల్లిదండ్రులు

కర్నూలు జిల్లా ఆదోని కస్తూర్బా బాలికల పాఠశాలలో 71మంది విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలు, పాఠశాల కమిటీ ఛైర్మన్‌కు కరోనా సోకింది. ఈనెల 15న 14మంది విద్యార్థినులు, ఏడుగురు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. పాఠశాలలోని 257 మంది విద్యార్థినులు, 25మంది సిబ్బందిలో మొత్తం 94 కేసులు రావడంతో పాఠశాలకు సెలవులు ప్రకటించారు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి పాఠశాలలపైనా ప్రభావం చూపుతోంది. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు వైరస్‌ బారినపడుతున్నారు. దీంతో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడులకు పంపించేందుకు నిరాకరిస్తున్నారు. పాఠశాలల్లో హాజరు క్రమంగా తగ్గిపోతోంది. వందల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు గంటల తరబడి ఒకేచోట ఉండడం, మాస్కులు సరిగా ధరించక పోవడంతో కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు ఉపాధ్యాయులు కొవిడ్‌తో మరణించారు. కృష్ణా జిల్లాలోని బడుల్లో ఎవరికైనా కరోనా వస్తే ఐదు రోజులు సెలవులు ఇచ్చి, మామూలుగా పునఃప్రారంభిస్తున్నారు. ఇతర చోట్ల కొవిడ్‌ బారినపడిన వారిని మాత్రమే ఇంటికి పంపించి యథావిధిగా విద్యాసంస్థలను కొనసాగిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున పిల్లల్ని బడులకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. దీంతో కొన్ని యాజమాన్యాలు ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థుల నుంచి ఐచ్ఛికాలు తీసుకుంటున్నాయి.

గుంటూరులోని కోన బాలప్రభాకర్‌ పురపాలక పాఠశాలలో మొత్తం 706మంది విద్యార్థులు ఉండగా.. ఇందులో శనివారం 436 మంది మాత్రమే హాజరయ్యారు.

విశాఖపట్నంలోని శ్రీహరిపురం నగరపాలక సంస్థ పాఠశాలకు విద్యార్థులను రెండు షిప్టుల్లో పంపించాలని తల్లిదండ్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడలోని కొమ్మ సీతారామయ్య బాలికల ఉన్నత పాఠశాలలో 565 మంది ఉండగా.. 60శాతంలోపే వస్తున్నారు. పదో తరగతిలో రోజూ 30పైగా గైర్హాజరవుతున్నారు.

కృష్ణాలో ఐదు.. ఇతర చోట్ల పట్టింపు లేదు..

కొన్ని జిల్లాల్లో పాజిటివ్‌ కేసు నమోదైనా ఎలాంటి సెలవు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో కరోనా వచ్చిన వారిని మాత్రమే ఇళ్లకు పంపించి, విద్యా సంస్థలను కొనసాగిస్తున్నారు.

కృష్ణా జిల్లా నిడమానూరు ఉన్నత పాఠశాలలో 1,446మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ పనిచేసే ఓ ఉపాధ్యాయుడు కరోనా బారినపడ్డారు. దీంతో ఐదు రోజులు సెలవు ప్రకటించారు.

అనంతపురం జిల్లాల్లో గత 10 రోజుల్లో సుమారు 40మంది ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. పాఠశాలలు, వసతి గృహాలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలకు చెందిన దాదాపు 70మందికి పాజిటివ్‌గా తేలింది.

నెల్లూరు జిల్లాలో 8మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది.

గుంటూరులో జలగం రామారావు, కాసు సాయమ్మ పాఠశాలలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు మరణించారు.

విజయనగరం జిల్లా బలిజపేట మండలం పలగరలోని పాఠశాలలో ఉపాధ్యాయుడికి కరోనా వస్తే ఎలాంటి సెలవు ఇవ్వకుండానే తరగతులు కొనసాగిస్తున్నారు. రామభద్రపురం మండలం బుస్యవలస కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నలుగురు విద్యార్థులు వైరస్‌ బారినపడినా ఎలాంటి సెలవు ప్రకటించలేదు.

పట్టించుకోని యాజమాన్యాలు..

కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు కరోనా కేసులు నమోదవుతున్నా బహిర్గతం చేయడం లేదు. ఇటీవల విజయవాడలోని ఓ విద్యా సంస్థలో విద్యార్థికి జ్వరం రావడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇంటికి పంపగా.. ఆ తర్వాత పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఈ విద్యార్థికి ఎలా వచ్చింది? ఆయన్ని కలిసిన వారు ఎవరనే దానిపై దృష్టిపెట్టలేదు. ఇలాంటి సంఘటనలతో వైరస్‌ వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తోంది.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona boom in educational institutions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0