Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details of what should and should not be done by those who come to be corona positive.

 కరోనా పాజిటివ్ అని వచ్చిన వాళ్ళు ఏమి చేయాలి ఏమి చేయగూడదు వివరాలు.


కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బంది పెడుతున్నది. మన దేశంలో సెకండ్ వేవ్ ఉధృతంగా మారడంతో రోగుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. రోగుల సంఖ్య భారీగా పెరుగడంతో దవాఖానల్లో బెడ్లు దొరకని పరిస్థితి నెలకొన్నది. ఆక్సిజన్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మటుకు ఈ వైరస్ సోకిన వారికి దవాఖానల్లో ఓపీ కింద వైద్యులు చికిత్స అందించే వీలున్నది. మనం ఇంట్లోనే ఉండి వైద్యుల సలహాలు పొందుతూ కరోనా పాజిటివ్ నుంచి బయటపడవచ్చు. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లయితే చేయాల్సినవి, చేయకూడనివి ఏంటో తెలుసుకుందాం.

చేయాల్సినవి..

  • తేలికపాటి లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చు.
  • అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న ప్రత్యేక గదిలో వేరుగా ఉండండి.
  • తక్కువ జ్వరం ఉంటే పారాసెటమాల్ తీసుకోవాలి.
  • జ్వరం, ఆక్సిజన్ స్థాయిలను రోజుకు కనీసం 10-15 సార్లు తనిఖీ చేసుకోవాలి. దీని కోసం మొబైల్ ఫోన్‌లో రిమైండర్‌ను సెట్ చేసుకోవాలి.
  • ఆక్సిజన్ స్థాయి 94-100 మధ్య ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది 94 కన్నా తక్కువ పడిపోతేనే వైద్యుడిని సంప్రదించాలి.
  • వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటే.. కనీసం 5-7 రోజులు జ్వరం వస్తుంది. ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది.
  • అందుకని జ్వరం, ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి.
  • ఇంటికి సమీపంలోని దవాఖానల్లోని పడకల లభ్యత గురించి సమాచారం సేకరించాలి.
  • ఏ హాస్పిటల్‌లో వెంటిలేటర్, ఐసీయూ లేదా ఆక్సిజన్ పడకలు ఉన్నాయో తెలుసుకోండి.
  • ద్రవ ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఇది ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం సులభం చేస్తుంది.
  • రోజులో కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి.
  • రోజంతా మాస్క్ ధరించాలి.
  • చేతులను తరుచుగా శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

చేయకూడనివి..

  • తేలికపాటి లక్షణాలు ఉంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్ లేదా రెమ్‌డెసివిర్ తీసుకోవద్దు.
  • లక్షణాలు తీవ్రంగా ఉంటే ఎప్పటికప్పుడు వైద్యుడికి వెల్లడిస్తూ ఆయన సలహాలు తీసుకోవాలి.
  • ఆక్సిజన్ స్థాయి నిరంతరం తగ్గిపోతుంటే వెంటనే దవాఖానకు వెళ్లాలి.
  • ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్‌లో కొనకూడదు. అందుకు సమయాన్ని వృథా చేయకూడదు.
  • డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోకూడదు.
  • గూగుల్ సెర్చ్ చేసి మందులు తీసుకోవద్దు.
  • సొంత వైద్యం తీసుకోవద్దు.
  • లక్షణాలు తీవ్రంగా ఉంటే ఇంట్లో చికిత్స తీసుకోవద్దు.
  • వాడేసిన మాస్కులను వినియోగించవద్దు.
  • మాస్క్ లేకుండా ఇంట్లో తిరుగకూడదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details of what should and should not be done by those who come to be corona positive."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0