Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Does body odor come from? OK if you use these tips.

 శరీరం నుంచి దుర్వాసన వస్తుందా? ఈ టిప్స్ ఉపయోగిస్తే సరి.

Does body odor come from?  OK if you use these tips.

వేసవి వల్ల ఇప్పటికీ కొన్ని నగరాల్లో ఉక్కపోత మొదలైంది . ఫలితంగా చెమట కూడా విపరీతంగా పడుతోంది . దీంతో శరీరం నుంచి దుర్వాసన కూడా వస్తుంది . ఆడా , మగా .. చిన్నా , పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ సమస్య వేదిస్తుంది . ముఖ్యంగా స్కూళ్లు , ఆఫీసులు . జనాల మధ్య పనిచేసేవారికి ఇది చాలా ఇబ్బంది పెడుతుంది . దుర్వాసన నివారణకు సింట్ కొట్టుకుంటే సరిపోతుందని చాలా మంది భావిస్తారు . కానీ , అది తాత్కాలిక మాత్రమే . శరీరాన్ని ఫ్రెష్ గా ఉంచుకుంటే .. ఆ సమస్యే ఉండదు . అందుకు ఈ కింది చిట్కాలను పాటించడం ఈ రోజు నుంచే మొదలు పెట్టండి . చలికాలంలో చాలా మందికి స్నానం చేసే అలవాటే ఉండదు . కానీ , వేసవిలో స్నానం తప్పనిసరి . టైమ్ లేదని వాయిదా వేయొద్దు . స్నానం మన శరీరానికి వ్యాక్సినేషన్ వంటిది . బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతుంది . శరీర దుర్వాసన సమస్య ఎక్కువగా ఉన్నవారు రోజుకి రెండు సార్లు స్నానం చేస్తే ఆరోగ్యానికి , పక్కవాళ్లకు కూడా మంచిది . శరీర దుర్వాసన నివారణకు అతిగా సెంట్లు లేదా డియోడరెంట్లు పొడితే చర్మ సమస్యలు తలెత్తవచ్చు . ఎప్పుడూ కూడా ఎక్కువశాతం నీళ్లలో తయారైన డియోలను వాడడమే ఉత్తమం . చెమట మీద సెంట్ అస్సలు కొట్టకండి . ఇది శరీర దుర్వాసను పెంచుతుంది . చెమట మీద సెంట్ కొడితే కొన్ని నిమిషాలు మంచి వాసనే వస్తుంది . ఆ తర్వాత వచ్చే కంపును మీరు కూడా భరించలేరు . దుర్వాసనను తగ్గాలంటే కాస్త వదులుగా , చెమటను నీల్చే దుస్తులు వేసుకోండి నైలాన్ , సిల్క్ తో తయారుచేసిన మందపాటి . బిగుతు దుస్తులు చేసుకుంటే చెమట బయటికి పోలేక వాసన వస్తుంది . శరీరానికి ఎంత స్వచ్ఛంగా గాలి తగిలితే ... దుర్వాసన అంత త్వరగా వీడుతుంది . దుస్తులు , కాస్త వదులుగా చేసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే దుర్వాసన బాధ ఉండదు . ఆండర్ ఆర్ట్స్ లో ఆడవిలా వెంటుకలు పెంచడం మంచిది కాదు . ఎప్పటికప్పుడు వాటిని షేన్ చేసి తొలగించాలి . ఆహారపు అలవాట్ల వల్ల శరీరం నుంచి ఎక్కువ దుర్వాసన వస్తుంది . ఉల్లి , వెల్లుల్లి పాయలు శరీర దుర్వాసనను పెంచుతాయి . కనుక వీటిని అధికంగా తీసుకోవద్దు . జింక్ , మెగ్నిషియం అధికంగా ఉండే ఆహారపదార్ధాలు ఎక్కువగా తినాలి . పైన చెప్పిన చిట్కాలన్నీ పాటించిన సరే శరీరం సుంచి దుర్వాసన వస్తుంటే .. వైద్యులను సంప్రదించండి .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Does body odor come from? OK if you use these tips."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0