Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

"DSC or Academic Structure to replace 'Ekopadhyaya' posts"

 "ఏకోపాధ్యాయ' పోస్టుల భర్తీకి డిఎస్సి లేదంటే అకడమిక్ ఇన్ స్ట్రక్చర్"

"DSC or Academic Structure to replace 'Ekopadhyaya' posts"


యాప్స్ సమస్య తగిస్తాం

ఉపాధ్యాయ సంఘాలకు కమిషనర్ హామీ

 రీ-అపార్షన్, బదిలీల వల్ల ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిన చోట్ల

పోస్టుల భర్తీకి డిఎస్సీ ప్రకటించాలా? అకడమిక్ ఇ కర్లను నియమిం చాలా అనే అంశంపై రాష్ట్రప్రభుత్వం చర్చిస్తోందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి చినవీరభద్రుడు తెలి పారు. త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఉపాధ్యాయ సంఘా లతో సోమవారం కో-ఆర్డినేషన్ సమావేశంలో చర్చించారు. యాప్ల సమస్యకు సంబంధించి త్వరలో విద్యాశాఖ మంత్రి సమక్షంలో వర్క్ షాపు నిర్వహిస్తామని కమిషనర్ చెప్పారు. టీచర్ల హాజరు మొబైల్ ఫోన్‌లో నమోదు చేసేందుకు వీలుగా యాప్ ను రూపొందిస్తామని తెలిపారు. విద్యార్థుల హాజరు తరగతి వారీగా విభజించి నమోదు చేసేలా సులభతరం చేస్తామ న్నారు. మధ్యాహ్న భోజన పథకం, శానిటేషన్ కు సంబంధించి ఫోటోల సంఖ్య తగ్గిస్తామని, ఉపాధ్యా యులకు భారం కాకుండా ఏరకంగా తగ్గించాలనేది వర్క్షాపులో నిర్ణయిస్తామ న్నారు. నెలవారీగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ఉత్త ర్వులు ఇస్తామని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అంతర్ జిల్లా బదిలీలు జరుపుతామన్నారు. గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, ఎస్టిటిలుగా పనిచేస్తున్న వారిలో పిహెచ్ డి చేసి అర్హులైన వారు ఉంటే డైట్ లెక్చరర్లుగా డిప్యు టేషన్ పద్ధతిలో నియమిస్తా మన్నారు. కరోనా బారిన పడ్డ ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాడు-నేడు పనుల బాధ్యత ప్రధానోపా ధ్యాయులు నిర్వహిస్తేనే పాఠశా లల నిర్మాణం బాగా జరుగుతుందని తెలిపారు. ఇబ్బందులు ఉంటే జిఓలో సవరణలు చెప్పాలని కోరారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుకు ఉన్న ఇబ్బందులను ఏవి ధంగా అధిగమించాలనే దానిపై సంఘాల అభిప్రా యాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఎసి ఇఆర్ టి డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ దేవానందరెడ్డి (సర్వీస్) యుటి ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్ ఎస్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు, ఎం రఘు నాధరెడ్డి, ఆష్టా ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్ రావు, సహాధ్యక్షులు ఎంజి మహడి, ఎపి ప్రధానోపా ధ్యాయుల సంఘం అధ్యక్షులు జివి నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి - వి శ్రీనివాసరావులు పాల్గొన్నారు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to ""DSC or Academic Structure to replace 'Ekopadhyaya' posts""

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0