Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

FLASH: CM Jagan's response on 10th and Inter examinations

 FLASH: టెన్త్, ఇంటర్ పరీక్షలపై సీఎం జగన్ స్పందన.

FLASH: CM Jagan's response on 10th and Inter examinations

అమరావతి: పదవతరగతి పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్ధుల భవిష్యత్తుకే నష్టమని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. టెన్త్ పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొంటుందని ఆయన చెప్పారు.జగనన్న వసతి దీవెన పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని బుధవారం నాడు ప్రారంభించారు.

విపత్కర పరిస్థితుల్లో కూడ కొంత మంది విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదన్నారు. పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని ఆయన గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్ధుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సీఎం చెప్పారు.

మార్కులను బట్టే ఏ విద్యార్ధికైనా భవిష్యత్తు ఉంటుందన్నారు. టెన్త్ , ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకొంటామని సీఎం చెప్పారు.

సర్టిఫికెట్లలో పాస్ అని ఇస్తేనే ఏ కాలేజీలో విద్యార్ధులకు సీట్లు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కష్టతరమైనా కూడ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతోనే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలు రద్దు చేయాలని కోరడం సులభమే కానీ నష్టపోయేది విద్యార్ధులేనని ఆయన చెప్పారు.

పరీక్షలు నిర్వహిస్తాం..

'విద్యార్థుల భవిష్యత్‌ సర్టిఫికెట్లపైనే ఆధారపడి ఉంటుంది. పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫికెట్లలో పాస్ అనే ఉంటుంది. పాస్ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా?. విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ ఉండాలనే పరీక్షలు. పరీక్షలు రద్దు చేయాలని చెప్పడం చాలా సులభమైన పనే. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించడం కష్టతరమైన పని. కష్టమైనా, భారమైనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ఒక్క విద్యార్థికి కూడా నష్టం జరగకుండా పరీక్షలు నిర్వహణ ఉంటుంది. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నాను' అని సీఎం జగన్ అన్నారు.

పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది,కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి.

టెన్త్, ఇంటర్ సర్టిఫికేట్ల పైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది

మార్కులను బట్టే ఏ విద్యార్థికైనా కాలేజీలో సీటు వస్తుంది- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు

VIEW THE VIDEO










SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "FLASH: CM Jagan's response on 10th and Inter examinations"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0