How many people are infected with the virus from a single person?
ఒక్క వ్యక్తి నుంచి ఎంత మందికి వైరస్ సోకుతుంది.
కరోనా రాకముందు నిర్లక్ష్యం. కరోనా వచ్చిన తరవాత దారుణం. ఇప్పుడు ఇదే పరిస్థితి... దేశంలోనూ రెండు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఒక్కో వ్యక్తి నుంచి ఎంత మందికి వైరస్ సోకుతుందో తెలియడం లేదు.
నిర్లక్ష్యంగా జనంతో కలిసి తిరుగుతున్న కరోనా బాధితులు!
కరోనా మొదటి వేవ్ జనాలను ఊచకోత కోసింది. సెకండ్ వేవ్ ఉధృతంగా చొచ్చుకెళ్తోంది. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా తేలిగ్గా తీసుకుంటున్నారు జనాలు. కేసులు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం చాలామంది కరోనా వచ్చిన వాళ్ళు టెస్ట్ చేయించుకోకపోగా.. చాలా నిర్లక్ష్యంగా జనంతో కలిసి తిరుగుతున్నారు.
టెస్ట్‌లు చేయించుకోకుండా గుట్టుగా ఉంటున్నారు!
కరోనా వచ్చినా, లక్షణాలు కనిపించినా, కనిపించకున్నా.. టెస్టులు చేయించుకోవడం లేదు సరికదా.. ఓ 5 రోజులు గుట్టు చప్పుడు కాకుండా లాగించేస్తే అది తగ్గిపోతుంది అని చాలామంది భావిస్తున్నట్లు తెలుస్తోంది. నలభై ఏళ్ల లోపు ఉన్నవాళ్లలో కరోనా వచ్చిన వాళ్ళు కొందరు ఇదే ధీమాతో జనంలో తిరిగేస్తున్నారు. వైరస్ సోకితే ప్రాణాలు పోతాయన్న భయం కంటే తమనెక్కడ అంటరాని వారిగా చూస్తారో అన్న ఆందోళన ఎక్కువగా ఉంది. తమ వల్ల కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. ఇతరులు ఇబ్బంది పడతారనే అవగాహన ఉన్నా సీరియస్‌గా తీసుకోవడం లేదు.
నాలుగు రోజుల్లో తగ్గిపోతుందనే ధీమాలో ఉన్నారా?
బస్‌స్టాపుల్లోనూ, మెట్రో స్టేషన్లు, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్సుల్లో, ఫంక్షన్లలో కరోనా రోగులు జనంతో కలిసి పోతున్నారు. కొందరికి టెస్టులపై ఆసక్తి లేక, భయంతో ఇలా ప్రవర్తిస్తుంటే ఇంకొందరు నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది కదా అనే ధీమాతో జనంలో పడి తిరుగుతున్నారు. అన్‌లాక్ కొత్తలో భయం భయంగా రోడ్లమీదకు వచ్చిన జనాల్లో.. ఇప్పుడు వైరస్ పడగ విప్పి బుస కొడుతున్నా లెక్కలేనితనం కనిపిస్తోంది. ప్రాణాల మీదకు వచ్చాక చూద్దాం అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
ఒక కరోనా పేషెంట్‌తో 120 మందికి వైరస్ వ్యాప్తి!
ఏడాదిన్నర క్రితం ఒక కరోనా పేషెంట్ వల్ల 12 మందికి వైరస్ సోకవచ్చనే అంచనా ఉండేది. ఇప్పుడది 120కి చేరింది. అంటే పదిరెట్లు. చాలా చోట్ల టెస్ట్‌లు చేయకపోవడం, పరీక్షలు చేసే సౌకర్యాలు లేవు. అసింప్టమేటిక్ వల్ల వైరస్‌ను గుర్తించక జనంలో తిరిగేస్తున్నారు కరోనా బాధితులు. కిందటేడు ఐడెంటిఫికేషన్ అయినా ఉండేది. ఇప్పుడు అదీ లేదు. సో వాళ్ల నుంచి తప్పించుకోవాలంటే మిగిలిన వాళ్ళంతా మాస్క్ వేసుకోవడం ఒక్కటే మార్గం.
0 Response to "How many people are infected with the virus from a single person?"
Post a Comment