Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Is the petrol tank full? However these precautions must be followed.

 పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారా ? అయితే ఈ జాగ్రత్తలు పాటించాలి.

Is the petrol tank full?  However these precautions must be followed.

  • ఎండల్లో కార్లు, బైకులు జాగ్రత్త
  • పెట్రోల్‌ ఫుల్‌ ట్యాంక్‌ కొట్టించొద్దు..
  • లీకేజీలతోనూ వాహనాలకు ముప్పు
  • జాగ్రత్తలు పాటించకపోతే జేబుకు చిల్లు

చిక్కడపల్లిలోని భారత్‌ పెట్రోలియంకు చెందిన ఒక బంక్‌లోరెండు రోజుల క్రితం వాహనంలో పెట్రోల్‌ పోస్తుండగా మంటలు చెలరేగాయి. ఒక వ్యక్తి సుజికి యాక్సిస్‌ ద్విచక్రవాహనంపై దూరప్రాంతానికి వెళ్లి వస్తూ మధ్యలో బంకు వద్ద పెట్రోల్‌ పోయించుకుంటుండగా వేడిగా ఉన్న ట్యాంక్‌ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన బంక్‌ సిబ్బంది మంటలను ఆరి్పవేశారు.

రెండు రోజుల క్రితం సూర్యాపేట నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న కారు తార్నాకలోని మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకోగానే ఇంజిన్‌ వేడెక్కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అప్రమత్తమైన కారు డ్రైవర్, అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధం అయింది.

భానుడి భగభగలకు ఇంధనం ఆవిరైపోతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాహనాల ఇంధనంపై ప్రభావం చూపుతున్నాయి. మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌తో ఒక వైపు తగ్గుతున్న మైలేజీకి తోడు ట్యాంక్‌లో పోస్తున్న ఇంధనం రోజువారీ అవసరాల కోసం ఏ మూలకు సరిపోవడం లేదు. ముఖ్యంగా ఎండల్లో పార్కింగ్‌తో ట్యాంకుల్లోని ఇంధనం వేడెక్కి ఆవిరై గాలిలో కలుస్తోంది.

ఫలితంగా వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రతిరోజు ధరల సవరణలతో పెట్రోల్‌ బంకులకు వెళ్లే వినియోగదారులు అవసరాలకు మించి వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌లను పోయించుకోవడం సర్వసాధారణమైంది. వాహనాల ట్యాంకులు ఉష్ణతాపానికి వేడెక్కి ఇంధనం ఆవిరైపోతుంది. ప్రతిరోజు సగటు వినియోగంలో 20 శాతానికి పైగా పెట్రోల్, డీజిల్‌ వేడికి ఆవిరై గాలిలో కలుస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ముప్పు పొంచి ఉంది..
సూర్యుడి ప్రతాపానికి కార్లు, ఆటోలు, బైక్‌ల నుంచి మంటలు చెలరేగుతాయి. సాధారణంగా వాహనాల్లో వాడుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ మండే స్వభావం కలిగి ఉంటాయి. ఇంధనాలు లీకైనా వేడికి వెంటనే మంటలు వచ్చేందుకు అవకాశం లేకపోలేదు. ఎక్కువ దూరం తిరిగే వాహనాలను తరచూ తనిఖీ చేయకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఏసీ కారులో ప్రయాణాలు సాగిస్తున్న వాహనదారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని మెకానిక్‌లు సూచిస్తున్నారు. వైరింగ్‌లో నాణ్యత లోపం, ఇంజన్‌ వేడెక్కడం, ఆయిల్, డీజిల్, పెట్రోల్, గ్యాస్‌ లీకేజీలతో మంటలు అంటుకునే అవకాశాలు లేకపోలేదు. వాహనాల్లో నాణ్యత లేని వైర్లు వాడడంతో నిప్పు రవ్వలు వచ్చి మంటలు అంటుకునే ప్రమాదమున్నది.




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Is the petrol tank full? However these precautions must be followed."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0