Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Kovid cases are being registered in large numbers in the country.

 దేశంలో భారీగా నమోదవుతున్న కోవిడ్ కేసులు .. కారణాలు చెప్పిన కేంద్రం .. !

Kovid cases are being registered in large numbers in the country.

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. సోమవారం ఒక్క రోజే దేశంలో 96,517 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 12,684,477కు చేరుకుంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించారు. దేశంలో కోవిడ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి ? అనే అంశంపై కేంద్రం ఈ సందర్బంగా పలు కారణాలను వివరించింది.

ప్రస్తుతం దేశంలో 10 రాష్ట్రాల్లో రోజూ భారీ ఎత్తున కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రజలు మాస్క్‌లు ధరించకపోవడమే కోవిడ్ కేసులు పెరగడం వెనుక ఉన్న ప్రధాన కారణమని కేంద్రం భావిస్తోంది. చాలా మంది మాస్క్‌లను సరిగ్గా ధరించడం లేదని, కొందరు అసలు పూర్తిగా వాటిని ధరించడం లేదని పేర్కొంది.

మాస్క్‌ను ముక్కు, నోరు, గడ్డం కవర్ చేసే విధంగా ధరించాలని, డబుల్ లేయర్ ఉన్న మాస్క్‌ను ధరించాలని కేంద్రం సూచించింది.

ఇక సామాజిక దూరం పాటించకపోవడం వల్ల కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. ప్రజలు కనీసం 1 మీటర్ దూరం ఉండే విధంగా తిరగాలని సూచించింది. గుంపులుగా వెళ్లవద్దని, మనిషికి, మనిషికి మధ్య కనీస దూరం ఉండాలని తెలిపింది. అలాగే శానిటైజర్లను ఎక్కువగా వాడాలని, మాస్క్ ధరించే ముందు, తీసేశాక చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించింది.

వచ్చే నాలుగు వారాలు చాలా సంక్లిష్టం 

 కేంద్రం దేశంలో కొవిడ్ -19 విస్తరణ వేగం గతేడాది కంటే బాగా పెరిగిందని , వ్యాధి తీవ్రత కూడా ఉదృతమైందని నీతి ఆయోగ్ సభ్యుడు ఆరోగ్యం )వీకే పాల్‌ పేర్కొన్నారు. రెండో దశకు సంబంధించి వచ్చే నాలుగు వారాలు అత్యంత క్లిష్టమైనవని చెప్పారు. కరోనా వ్యాప్తికి  అడ్డుకట్ట వేసేందుకు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని స్పష్టంచేశారు. మంగళవారమిక్కడ ఆయన దేశంలో కరోనా పరిస్థితిపై విలేకరులతో మాట్లాడారు. ‘‘రెండో దశ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం. వచ్చే నాలుగు వారాలు అత్యంత క్లిష్టమైనవి. మహమ్మారిపై పోరాడేందుకు దేశమంతా ఒక్కటై చర్యలు చేపట్టాలి’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాధిపై పోరుకు ఉపయోగపడే అంశాలు (పరికరాలు) గతంలో ఉన్నవేనని స్పష్టంచేశారు. కొవిడ్‌-19 పట్ల అవగాహనతో వ్యవహరించడం, కట్టడి మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటించడం, ఆరోగ్య సదుపాయాలను పెంచడం, టీకాల కార్యక్రమం వేగం పెంచడం వంటివాటితో అడ్డుకోవచ్చని తెలిపారు. ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలని, రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలని సూచించారు. కాగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున 18 ఏళ్లు దాటిన పౌరులు అందరూ టీకాలు పొందేందుకు అనుమతించాలని భారతీయ వైద్య సంఘం ప్రధానికి లేఖ రాసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Kovid cases are being registered in large numbers in the country."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0