Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

More than 93 thousand corona cases in a single day

దడ పుట్టిస్తున్న మహమ్మారి.

More than 93 thousand corona cases in a single day

ఒక్కరోజే 93వేలకు పైగా కరోనా కేసులు

ఈ ఏడాదిలో అత్యధికం

సెప్టెంబరు నాటి పరిస్థితులు


 దేశంలో కరోనా కేసులు మరింత పైకి ఎగబాకాయి. గత 24 గంటల్లో 93,249 కొత్త కేసులొచ్చాయి. 2021లో ఇంత భారీ సంఖ్యలో రావడం ఇదే తొలిసారి. కేసుల సంఖ్య 90వేలు దాటడం గత సెప్టెంబరు తర్వాత ఇదే మొదలు. ఆ నెల 6-20వ తేదీల మధ్యలో 12 సార్లు 90వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. సెప్టెంబరు 17న గరిష్ఠంగా 97,894 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. గత ఒక్కరోజులో 4.62%మేర కేసులు పెరిగాయి. తాజాగా వైరస్‌ నుంచి కోలుకోలేక 513 మంది మృతి చెందారు. క్రితం రోజుతో పోల్చితే మరణాల సంఖ్య తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం వైరస్‌ బాధితుల సంఖ్య 1,24,85,509కి, మరణాల సంఖ్య 1,64,623కి పెరిగింది. కొత్తగా 60,048 మంది కరోనా నుంచి కోలుకోవడంతో వైరస్‌ను జయించిన వారి సంఖ్య 1,16,29,289కి చేరింది.

8 రాష్ట్రాల నుంచి 80 శాతం కేసులు

రోజువారీ లాగానే 80.96% కొత్త కేసులు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, దిల్లీ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ల నుంచే ఉన్నాయి. ఇందులో మహారాష్ట్ర వాటా ఒక్కటే 53.02% (49,447) ఉండటం ఆందోళన కల్గించే అంశం. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 1-4 తేదీల మధ్య రోజుకు సగటున 84,043.5 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల డబ్లింగ్‌ సమయం దారుణంగా పడిపోయింది. మార్చి 1న డబ్లింగ్‌ టైం 504.4 రోజులు ఉండగా, ఏప్రిల్‌ 4 నాటికి అది 115.4 రోజులకు తగ్గిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,91,597 క్రియాశీల కేసులు ఉండగా.. అందులో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌, కేరళ, పంజాబ్‌ల వాటా 76.41శాతంగా ఉంది.

రెండోరోజూ ప్రపంచంలో అత్యధికం..

భారత్‌ వరుసగా రెండోరోజు ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదు చేసింది. క్రితం రోజు అమెరికా కంటే 41%, బ్రెజిల్‌ కంటే 126% అధిక కేసులు మన దగ్గర నమోదయ్యాయి. మొత్తం సంఖ్యా పరంగానూ బ్రెజిల్‌కు సమీపంలోకి భారత్‌ దూసుకొస్తోంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 4.69 లక్షల కేసుల తేడా మాత్రమే ఉంది. ఈ వేగం ఇలాగే కొనసాగితే భారత్‌ మరో పక్షం రోజుల్లో బ్రెజిల్‌ను వెనక్కునెట్టి కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండో స్థానానికి ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "More than 93 thousand corona cases in a single day "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0