Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sanitizer Side Effects: Do you use Sanitizer more often .. Do you know how harmful it is to health?

 Sanitizer Side Effects: శానిటైజర్ ఎక్కువగా వాడుతున్నారా అయితే ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసుకుందాం.

Sanitizer Side Effects: Do you use Sanitizer more often .. Do you know how harmful it is to health?

Sanitizer Side Effects:ప్రస్తుతం మానవజీవితం కరోనాకు ముందు.. తర్వాత అని చెప్పవచ్చు.. గత ఏడాది నుంచి కరోనా నివారణ కోసం చేతులను తరచుగా శుభ్రపరచుకోవడం, మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు హెచ్చించారు. ఇక ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బయటకు వెళ్ళితే మాస్కులను తప్పనిసరిగా ధరిస్తూనే.. చేతులను శుభ్రపరచుకోవడానికి శాని టైజర్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే కరోనా వెలుగులోకి రాకముందు ఈ హ్యాండ్ శానిటైజర్లను మెడికల్ సిబ్బంది వారు మాత్రమే ఎక్కువగా ఉపయోగించేవారు.

వ్యక్తి గత శుభ్రత కోసం ఎక్కువగా శానిటైజర్స్ వినియోగించడం కూడా అనారోగ్యానికి కారణమని వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సార్లు చేతులను శుభ్రపరచుకోవడానికి శాని టైజర్ వాడటం వల్ల మన అరచేతుల్లోని మంచి బ్యాక్టీరియాకు హాని జాగుతుంది. ఈ మంచి బ్యాక్టీరియా మన చర్మాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతో ఉపయోగపడుతుంది. అటువంటి ఈ మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లకపోతే మనం రోగాల బారిన పడటం ఖాయం.

అంతేకాకుండా తరచుగా శానిటైజర్ వాడుతున్నట్లయితే చేతుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మరణించి.. చెడు బ్యాక్టీరియా శక్తివంతంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బ్యాక్టీరియా తరచుగా వాడే శానిటైజరకు అలవాటుపడి, నిరోధక శక్తిని చుకుంటుంది. దీంతో అప్పుడు మనం శానిటైజర్‌తో స్నానం చేసినా లాభం లేకుండా పోతుందని అంటున్నారు. మరికొందరు కోవిడ్ భయంతో దగ్గినా తుమ్మినా వెంటనే చేతులకు శానిటైజర్ రాసుకుంటున్నారని.. ఇలా చేయటం వల్ల ఏ లాభమూ ఉండదని అంటున్నారు. గాల్లోని క్రిములను శానిటైజర్ చంపలేదని.. అందుకని భయాందోళనకు గురి కాకుండా తరచుగా శానిటైజర్స్ వాడకం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

ఎక్కుగా శానిటైజర్స్ వాడే బదులు.. సబ్బు, నీళ్లను చేతులను శుభ్రపరచుకోవడానికి ఉపయోగించాలని సూచిస్తున్నారు. సబ్బు తో శుభ్రంగా చేతులను కడుక్కోవడం ద్వారా క్రిములను నివారించవచ్చని యూఎస్సెం టర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్
ప్రకటించింది.

ఇక లాక్ డౌన్ సమయంలో తాగడానికి మందు అందుబాటులోకి లేని సమయంలో శానిటైజర్స్ తాగి మరణించినవారు కూడా ఉన్నారు. ఇది తాగడంవల్ల అనారోగ్యానికి గురవుతారని..ఊపిరితిత్తులు దెబ్బతిని లిపిడ్ న్యుమోనియా వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు క్రమంగా కిడ్నీలు పాడవుతాయని.. స్వల్ప కాలంలోనే వాంతులు, విరేచనాలతో చనిపోతారని అందుకని శానిటైజర్ తాగడం ప్రమాదకమని హెచ్చరిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sanitizer Side Effects: Do you use Sanitizer more often .. Do you know how harmful it is to health?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0