Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Southern Railway Notification-2021

 Southern Railway : మొత్తం 191 పోస్టుల భర్తీకి సదరన్ రైల్వే నోటిఫికేషన్.

Southern Railway Notification-2021

Southern Railway Notification-2021 రైల్వేలో ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలవుతు న్నాయి . సదరన్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం.

సదరన్ రైల్వే పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 191 పోస్టులున్నాయి. నర్సింగ్ సూపరింటెండెంట్, ఫిజియోథెరపిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, హెమోడయాలిసిస్ టెక్నీషియన్, హాస్పిటల్ అసిస్టెంట్, హౌజ్ కీపింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, రేడియోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 30 చివరి తేదీ. ఎంపికైన పారామెడికల్ సిబ్బందికి చెన్నైలోని పెరంబూర్‌లో గల హెడ్‌క్వార్టర్స్ రైల్వే హాస్పిటల్‌లో పోస్టింగ్ ఉంటుంది. ఇవి కంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు- 191
నర్సింగ్ సూపరింటెండెంట్- 83

ఫిజియోథెరపిస్ట్- 1

ఈసీజీ టెక్నీషియన్- 4
హెమోడయాలిసిస్ టెక్నీషియన్- 3
హాస్పిటల్ అసిస్టెంట్- 48
హౌజ్ కీపింగ్ అసిస్టెంట్- 40
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2- 9
రేడియోగ్రాఫర్- 3

జీతాల వివరాలు

నర్సింగ్ సూపరింటెండెంట్- రూ.44,900 + డీఏ + ఇతర అలవెన్సులు
ఫిజియోథెరపిస్ట్- రూ.35,400 + డీఏ + ఇతర అలవెన్సులు
ఈసీజీ టెక్నీషియన్- రూ.25,500 + డీఏ + ఇతర అలవెన్సులు
హెమోడయాలిసిస్ టెక్నీషియన్- రూ.35,400 + డీఏ + ఇతర అలవెన్సులు
హాస్పిటల్ అసిస్టెంట్- రూ.18,000 + డీఏ + ఇతర అలవెన్సులు
హౌజ్ కీపింగ్ అసిస్టెంట్- రూ.18,000 + డీఏ + ఇతర అలవెన్సులు
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2- రూ.21,700 + డీఏ + ఇతర అలవెన్సులు
రేడియోగ్రాఫర్- రూ.29,200 + డీఏ + ఇతర అలవెన్సులు

దరఖాస్తుకు చివరి తేదీ- 30.04.2021 
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
ఎంపిక విధానం- టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థులు ముందుగా మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. పూర్తిగా ఫిట్‌నెస్ ఉన్నవారికే అవకాశం లభిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Southern Railway Notification-2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0