The corona does not say when objects are tied!
వస్తువులను ముడితే కరోనా అంటదు !
- తేల్చి చెప్పిన అమెరికా సీడీసీ
- దానితో ముప్పు కేవలం 0.01 శాతమేనని వెల్లడి
- మాస్క్ లే రక్షణ కవచాలని కామెంట్
న్యూఢిల్లీ : కరోనా వచ్చిన కొత్తల్లో .. మహమ్మారి మన గడపదాటి లోపలికి రాకుండా ఎన్నెన్ని చేశాం ! తెచ్చుకున్న కూరగాయలు .. పండ్లను ఉప్పు నీళ్లల్లో వేసి కడుక్కున్నాం . ఆఫీసులు , వీధులు , ట్రాన్స్పర్టేషన్ వెహికలు శానిటైజ్ చేశాం . కారణం ... వస్తువులు , బయటి ప్రాంతాల ఉపరితలాలపై వైరస్ ఉంటుందని అప్పట్లో సైం టిస్టులు చెప్పడమే . అయితే , ఇప్పుడు అబ్బే అదేం లేదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ( సీడీసీ ) తేల్చి చెప్పింది . సర్ఫేస్ మీద వైరస్ ఉనికి అంతంత మాత్రమేనని , వాటిని ముట్టు కోవడం వల్ల కరోనా సోకే ముప్పు కేవలం 0.01 శాతమేనని వెల్లడించింది .
అతి కడుగుడు అక్కర్లేదు
కరోనా భయంతో చాలా మంది ప్రమాదకర మైన కెమికల్స్ , ఇతర పద్ధతుల్లో సర్ఫేన్లను శుభ్రం చేస్తున్నారని , అయితే , ఆ అతికడుగు డు అక్కర్లేదని సీడీసీ సూచించింది . సర్ఫేస్ లతో వైరస్ సోకే ప్రమాదం పది వేలలో ఒక వంతు మాత్రమేనని పేర్కొంది . చేతులను మామూలుగా కడుక్కోవడం , మాస్కులు పెట్టుకోవడం , నీళ్లు , మనం ఎప్పుడూ వాడే సబ్బుతో శుభ్రం చేసుకుంటే సరిపోతుందని చెప్పింది . అంతేగానీ , డిసిన్ఫెక్టెంట్లు , కెమికల్ వైప్స్ తో అవసరం లేదని , వాటిపై హైప్ క్రియేట్ చేయడం తగదని సూచించింది .
డైరెక్ట్ కాంటాక్ట్ వల్లే కరోనా
కరోనా సోకిన వ్యక్తి నోరు లేదా ముక్కు నుంచి విడుదలయ్యే ఏరోసాల్స్ వైరతో కూడిన బిందువులు ) ద్వారానే వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని సీడీసీ వెల్లడించింది . ఆ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే మహ మ్మారి సోకుతుందని చెప్పింది . అందరూ కచ్చి తంగా , సరైన పద్ధతిలో మాస్కులు పెట్టుకుంటే కరోనా సోకే ముప్పు తగ్గుతుందని సూచించింది .
0 Response to "The corona does not say when objects are tied!"
Post a Comment