Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The same is better than locking down the virus building

 వైరస్ కట్టడికి లాక్ డౌన్ కన్నా అదే మేలు


కొవిడ్​ వ్యాప్తిని అరికట్టడానికి లాక్​డౌన్​ కన్నా గుంపులుగా తిరగకపోవడం, భౌతిక దూరం పాటించడమే కీలకమని డబ్ల్యూహెచ్​ఓ అధికారి డా.పూనమ్ సింగ్ అన్నారు. పరీక్షలు, చికిత్సను పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

కొవిడ్​ 19, దాని రకాల వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, నిబంధనలను పాటించడమే సరైన మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ఆగ్నేయాసియ ప్రాంత డైరెక్టర్ డా. పూనమ్ ఖేత్రపాల్ సింగ్​ అన్నారు. టెస్ట్, ట్రేస్, ఐసొలేట్, ట్రీట్​మెంట్​ కోసం చేస్తున్న కృషిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఏప్రిల్​ ఆరంభం నుంచి భారత్​లో తీవ్ర స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం మరో 1,45,384 కొత్త కేసులతో దేశంలో కేసుల సంఖ్య 1,32,05,926కు పెరిగింది.

ఈ నేపథ్యంలో లాక్​డౌన్​లతో సంబంధం లేకుండా సమూహాల్లో తిరగకపోవడం, భౌతిక దూరం లాంటివి కొవిడ్​ వ్యాప్తిని మందగిస్తాయని సింగ్​ సూచించారు. మహమ్మారిపై పోరాటంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, దగ్గేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానమని చెప్పారు. ప్రజారోగ్య, సామాజిక చర్యలను కఠినంగా అమలు చేయడం వైరస్ వ్యాప్తి నిరోధానికి కీలకమని అన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The same is better than locking down the virus building"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0