Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Autos and city buses in AP from tomorrow till 12- If you return after that, you will be under siege

 AP లో రేపటి  నుంచి ఆటోలు,బస్సులు సిటీ బస్సులూ 12 వరకే- ఆ తర్వాత తిరిగితే సీజ్‌

Autos and city buses in AP from tomorrow till 12- If you return after that, you will be under siege

  • మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలుకు మంత్రివర్గం ఆమోదం
  • ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే అనుమతి ఇవ్వాలని నిర్ణయం
  • మధ్యాహ్నం 12 తర్వాత వాహనాలను పూర్తిగా ఆపివేయాలని నిర్ణయం
  • మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు
  • మధ్యాహ్నం 12 తర్వాత నిలిచిపోనున్న అంతర్రాష్ట్ర, దూరప్రాంత బస్సులు

ముగిసిన ఏపీ కేబినెట్ స‌మావేశం

  • వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌ధానికి లేఖ రాయాల‌ని కేబినెట్ నిర్ణ‌యం.
  • 45 ఏళ్లు పైబ‌డ్డ‌వారికి వ్యాక్సినేష‌న్‌లో తొలి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిర్ణ‌యం.
  • ఆక్సిజ‌న్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి మండ‌లి తీర్మానం.
  • ఎలక్ట్రానిక్‌ పాలసీతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుకు అవగాహన ఒప్పందం చేసుకోవడంపైన, రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తీసుకుంటున్న చర్యలపై  నిర్ణయాలు.
  • రైతు భరోసా కోసం రూ .3,030 కోట్లకు ఆమోదం.
  • వైయ‌స్ఆర్‌ ఉచిత భీమా పథకానికి కేబినెట్ ఆమోదం.
  • రూ .2,589 కోట్లతో వైయ‌స్సార్ ఉచిత భీమా పథకం అమలు.
  • వైయ‌స్ఆర్‌ మత్స్యకార భరోసా పథకానికి ఆమోదం.
  • మత్స్యకారులకు రూ .10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాల‌ని మంత్రి మండ‌లి నిర్ణ‌యం.

ఏపీలో కరోనా కేసుల విజృంభణ దృష్ట్యా రాకపోకల నియంత్రణకు రేపటి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచేందుకు అనుమతిస్తామని  ప్రకటించింది. దీంతో పాటు ప్రజా రవాణాపైనా ఆంక్షలు విధించనున్నారు.

ఏపీలో కరోనా కేసుల కల్లోలం దృష్ట్యా రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజా రవాణాను కూడా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ఆటోలను సీజ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీటితో పాటు సిటీ బస్సుల రాకపోకలను కూడా నియంత్రించేందుకు వీలుగా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. నిర్ణీత సమయాలను మించి రాకపోకల్ని నియంత్రించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మద్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవల వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతించనున్నారు. ఉదయం షాపులు తెరిచే సమయంలోనే ప్రజా రవాణాకు కూడా అనుమతించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ సమయంలోనూ 144 సెక్షన్‌ అమలు చేయబోతోంది. అంటే గుంపులు గుంపులుగా షాపింగ్‌లు చేయడం, ప్రయాణాలు చేయడాన్ని నిషేధిస్తున్నారు. రేపటి నుంచి మొదలయ్యే ఈ ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ పరిస్థితులపై మంత్రులు, ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ''కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారి ప్రాథమిక కాంట్రాక్టును గుర్తించి వారికీ పక్కాగా పరీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వం ఎంప్యానెల్‌ జాబితాలో ఉన్న ఆస్పత్రుల్లోనూ వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది కొరత లేకుండా చూడాలి.. దిగుమతి చేసుకున్న ఆక్సిజన్‌ను నిల్వ చేసుకునేందుకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి....'' అని సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఆక్సిజన్‌ కోటా పెంచాలి
రాష్ట్రానికి 480 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయించగా చాలినన్ని ట్యాంకర్లు లేక 448 మెట్రిక్‌ టన్నులే తీసుకుంటున్నారు. ఆక్సిజన్‌ రవాణాకే కాదు నిల్వ కోసమూ మరిన్ని ట్యాంకర్లు అవసరం ఉంది. ప్రస్తుతం రోజుకు సగటున 420 నుంచి 500 మెట్రిక్‌ టన్నుల వరకు ఆక్సిజన్‌ వినియోగిస్తుండగా మే రెండో వారం చివరి నాటికి ఈ డిమాండ్‌ రెట్టింపు అవుతుందని అంచనా. రాష్ట్రంలో ఆక్సిజన్‌ వసతి ఉన్న ఆస్పత్రులు 146. వాటిలో పైపుల ద్వారా ఆక్సిజన్‌ అందుబాటులో ఉన్న పడకలు 26,446. రాష్ట్రానికి ఆక్సిజన్‌ కోటా పెంచాలని అధికారులు కేంద్రాన్ని కోరారు. రవాణాకువాహనాలూ కావాలని అడిగారు.రాష్ట్రంలో కొత్తగా మైలాన్‌ ల్యాబ్‌ నుంచి ఎనిమిది లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్‌95 మాస్కులు 5,67,844, పీపీఈలు 7,66,732, సర్జికల్‌ మాస్కులు 35,46,100, హోం ఐసోలేషన్‌ కిట్లు 2,04,960 మేరకు నిల్వలు ఉన్నాయి.

లక్ష మందికి పైగా హోం ఐసొలేషన్‌
రాష్ట్రంలో 558 కొవిడ్‌ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రస్తుతం 3,597 మంది వెంటిలేటర్లపై ఉన్నారు. 37,760 మంది చికిత్స పొందుతున్నారు. 1,01,240 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో 44,599 పడకలు ఉన్నాయి. ఇంతవరకు 1,66,02,873 మందికి కరోనా పరీక్షలు చేశారు. 81 కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 41,780 పడకలు ఉన్నాయి. ఇక్కడ మే 2 వరకు 9,973 మంది చికిత్స పొందుతున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతంసవాంగ్‌, కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకాధికారి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎ.కె.సింఘాల్‌, టాస్క్‌ఫోర్సు కమిటీ ఛైర్మన్‌ ఎం.టి. కృష్ణబాబు, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, 104 సేవల విభాగం ఇన్‌ఛార్జి ఎ.బాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌, ఆర్థికశాఖ కార్యదర్శి నటరాజన్‌ గుల్జార్‌, ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.

కరోనా ఎఫెక్ట్‌: ఏపీలో జూ పార్క్‌లు మూసివేత

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అటవీశాఖ ఆదేశాలు

ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్ ఎకో పార్క్‌లు మూసివేత

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని జూ పార్క్‌లు మూసివేస్తున్నట్లు అటవీశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జూ లతో పాటు ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్ ఎకో పార్క్‌లు మూసివేయాలని నిర్ణయించింది. జూ పార్క్‌ల్లో జంతువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అటవీశాఖ ఆదేశించింది.

ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ..

కోవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రేపట్నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యావసరాలు  కొనుగోలు చేసేందుకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్‌ అమలు చేస్తూ సడలింపు కల్పిస్తారు. ఆ సమయంలో ఐదుగురికి మించి గుమికూడరాదు. మధ్యాహ్నం 12 తరువాత షాపులన్నీ తప్పనిసరిగా మూసివేయాలి. అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Autos and city buses in AP from tomorrow till 12- If you return after that, you will be under siege"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0