Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP People, traders, consumers, your police station their appeal

 AP ప్రజలకు, వర్తకులకు, వినియోగదారులకు, మీ పోలీసు స్టేషన్ వారి విజ్ఞప్తి

AP People, traders, consumers, your police station their appeal

AP ప్రజలకు  పోలీసు స్టేషన్ వారి విజ్ఞప్తి

  • 1) ఏపీలో నేటి నుండి (అనగా 05.05.2021) మధ్యాహ్నం  12 గంటల నుండి మన రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది
  • 2) బుధవారం మధ్యాహ్నం 12 నుంచి కర్ఫ్యూ ఆంక్షలు అమలు లో ఉంటాయి
  • 3) ఉదయం 6 గంటలు నుండి 12 గంటల వరకు సామానులు కొనడానికి వచ్చిన ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి మరియు సామాజిక దూరం పాటించాలి.
  • 3) షాప్ యజమానులు తప్పనిసరిగా, తమ షాప్ ముందు సామాజిక దూరం ఉండేలా మార్కింగ్ చెయ్యాలి
  • 4) షాప్ యజమానులు తమ షాప్ కు వచ్చే ప్రజలకు మాస్క్ ఉంటేనే సామానులు ఇవ్వవలెను
  • 5) హోటల్స్ యజమానులు టిఫిన్ మరియు భోజనం పార్సెల్ మాత్రమే ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో హోటల్ లో తినరాదు.
  • 6) జీప్ లలో 6 మంది మరియు ఆటో లలో 4 మంది మాత్రమే ప్రయాణికులు ఉండాలి (ఉదయం 6 నుండి 12 గంటల వరకు)
  • 7) మధ్యాహ్నం 12 గంటలు తరువాత ఎటువంటి ప్రయాణాలు చేయరాదు
  • 8) అత్యవసర ప్రయాణాలకు మాత్రమే అనుమతి (మెడికల్ ఎమర్జెన్సీ)
  • 9) 144 సెక్షన్ అమలులో ఉంటుంది, కావున 4 గురు కంటే ఎక్కువ మంది ఏ సమయంలో (ఉదయం 6 నుండి 12 గంటల వరకు) కూడా గుమి కూడరాదు. ఎట్టి పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించాలి, మాస్క్ ధరించాలి.
  •  10 షాపుల యజమానులు ఉదయం 6గం,, ల నుండి 11:45 గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యకలాపాలు జరుపుకోవాలి.  ఎట్టి పరిస్థితుల్లోనూ 12 గంటల లోపల తమ దుకాణాలు మూసి వెయ్యాలి.కోవిడ్ ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలి
  •  11. ఎవరైనా కోవిడ్ ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న షాపు లను తాత్కాలికంగా సీజ్ చేయబడును.
  •  12 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాలు (బస్సులు/మినీ బస్సులు/ఆటోలు/కాబ్ లు) ఉన్న కెపాసిటీ కంటే సగం మందిని మాత్రమే ఎక్కించుకోవాలి. మాస్క్ తప్పనిసరి గా దరించేలా చూడాలి, శానిటయిజర్ వాడాలి
  •  13 ఈ విదంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది
  •  14 . అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రాకండి. 
  •  15. కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి పౌరుడు నడుం బిగించాలి. అధికారులకు సహకరించాలి.
  • 16.అందరూ  పైన చెప్పిన విదంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించండి సురక్షితంగా ఉండండి.
  • 17 .సోషల్ మీడియాలలో వచ్చిన ప్రతిదాన్ని నమ్మకండి... భయపడకండి. మన భయమే మన శత్రువు అనే విషయం గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉంటారని ఆశిస్తూ
  • జిల్లా పోలీసులు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP People, traders, consumers, your police station their appeal"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0