Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Be careful with black fungus

 బ్లాక్ ఫంగస్ తో జాగ్రత్త

Be careful with black fungus

  • నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు 
  • ఫంగస్ బాధితుల్లో మరణాలు 50 శాతం ! 
  •  కొవిడ్ రోగులు జాగ్రత్తగా ఉండాలి - ఇన్ఫెక్షన్‌ను త్వరగా గుర్తించాలి 
  • రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోవాలి 
  • అవగాహనతోనే ఫంగస్ వ్యాప్తికి అడ్డుకట్ట - కేంద్ర ప్రభుత్వం , ఐసీఎంఆర్ వెల్లడి 
  •  స్టెరాయిడ్ల దుర్వినియోగంతోనే ఫంగస్ : గులేరియా 

న్యూఢిల్లీ , మే 16 : కరోనా మహమ్మారితోనే జనం అల్లాడిపోతుంటే .. ఇప్పుడు మరో వైరస్ వణుకు పుట్టిస్తోంది . అదే బ్లాక్ ఫంగస్ ( మ్యుకోరెమైకోసిస్ ) . వైరస్ బారిన పడి కోలుకున్న వారిని ఈ బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది . ఈ ఇన్ ఫెక్షన్ సోకిన వారికి చికిత్సలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమా దంగా మారుతోంది . కొవిడ్ రోగులకు ప్రాణాంత కంగా మారిన ఈ బ్లాక్ ఫంగస్ ను కట్టడి చేసేం దుకు కేంద్ర ప్రభుత్వం , ఐసీఎంఆర్లు కృషి చేస్తు న్నాయి . ఈ ఫంగస్ సోకిన వారిలో మరణాలు 50 శాతంగా ఉన్నాయి . అంటే ప్రతి ఇద్దరు బాధితుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు . ఫంగస్ సోకిన వారికి తలనొప్పి , ముక్కు దిబ్బడ , జ్వరం , కంటి చూపు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి . రోజు రోజుకూ ఈ ఫంగస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపో తుండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ , ఐసీఎంఆర్ పలు సూచనలు చేశాయి . " బ్లాక్ ఫంగసను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం . గాలి పీల్చుకున్నప్పుడు మ్యుకోర్ ఆనే ఫంగస్ సైనస్ లేదా ఊపిరితిత్తుల్లో చేరుతుంది " అని తెలిపాయి . కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా ఈ ఫంగస్ పై ప్రజలకు అవగాహన కల్పించేలా ఓ ట్వీట్‌ను షేర్ చేశారు . ఫంగస్ లక్షణాలు , దీని వల్ల కలిగే దుష్పరిణామాలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు , ఏం చేయాలి ? ఏం చేయ కూడదు ? వంటి వివరాలను వెల్లడించారు . త్వరగా ఈ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడం , అవగాహన పెంచుకో వడం ద్వారానే బ్లాక్ ఫంగస్ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు.

 స్టెరాయిడ్ల దుర్వినియోగమూ కారణమే : గులేరియా 

కొవిడ్ రోగుల్లో బ్లాక్ ఫంగస్ పెరిగిపోవడానికి స్టెరాయిడ్ల దుర్వినియోగం కూడా కారణమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు . ఈ ఫంగల్ ఇన్ ఫెక్షన్ కొత్తదేమీ కాదని చెప్పారు . కొవిడ్ -19 కారణంగా ఇప్పుడీ కేసులు పెరు గుతున్నాయని తెలిపారు . కోవిడ్ బాధితుల్లో ఈ కేసులు పెరగడానికి ప్రధాన కారణం స్టెరాయిడ్లను ఇష్టానుసారం వినియోగించడమేనని చెప్పారు . మధుమేహ వ్యాధిగ్రస్తులు , కొవిడ్ రోగులు , స్టెరా యిడ్లు వినియోగిస్తున్న వారికి ఈ ఫంగస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని వివరించారు . " ఈ ఫంగస్ ముఖంపై ప్రభావం చూపుతుంది . ముక్కు నుంచి ప్రారంభమై కళ్ల చుట్టూ ఉండే కండరాలను బలహీనపరుస్తుంది . కంటిచూపు కోల్పోయేందుకు కారణమవుతోంది . మెదడుకూ చేరుతోంది . ఇది ఊపి రితిత్తులకూ వ్యాపిస్తోంది " అని గులేరియా తెలి పారు . ఆస్పత్రుల్లో ఇన్ ఫెక్షన్లు సోకకుండా చూసే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు . కొవిడ్ నుంచి కోలుకున్నా .. ఆ తర్వాత వచ్చే ఇన్ ఫెక్షన్లు , ఫంగ తో మరణాలు పెరుగుతున్నాయని తెలిపారు .

ఏం చేయాలంటే .. ? 

  • కరోనా నుంచి కోలుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోవాలి .  
  • రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిం చుకోవాలి . 
  • స్టెరాయిడ్లను తగిన మోతాదులో తీసుకోవాలి.
  • యాంటీబయాటిక్లు , యాంటీ ఫంగల్స్ ఔషధా లను కూడా తగిన మోతాదులో వాడాలి.
  • ఆక్సిజన్ థెరపీ సమయంలో తేమ కోసం శుభ్ర మైన నీటినే ఉపయోగించాలి . 

చేయకూడనివి ... 

  • ఫంగస్ కు సంబంధించిన సంకేతాలు , లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు . 
  • ముక్కుదిబ్బడ వేసిన ప్రతి కేసునూ బ్యాక్టీరియా సైనసైటిస్ కేసులుగా పరిగణించవద్దు . 
  • ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా కొవిడ్ రోగులు దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు . 
  • ఫంగన్ను గుర్తించడానికి అవసరమైన విస్తృత పరీక్షలకు వెనకాడవద్దు . 
  • బ్లాక్ ఫెంగకు ప్రాథమికంగా చికిత్సను ప్రారం భించే కీలకమైన సమయాన్ని కోల్పోవద్దు . నివారణా చర్యలివే .. 
  • రోగ నిరోధక శక్తిని పెంచే పౌష్టిక , సమతుల ఆహారాన్ని తీసుకోవాలి . ఎల్లప్పుడూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి . 

బయటకు వెళ్లినప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా చూసుకోవాలి . వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి . ఆరోగ్యం , మందుల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Be careful with black fungus"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0