Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Highlights from the CM review

 మన వర్సిటీలు ర్యాంకుల్లో ముందుండాలి

Highlights from the CM review

  •  కార్యాచరణ రూపొందించాలి
  • శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల నిర్మాణం పూర్తి చేయండి
  • సమీక్షలో సీఎం జగన్‌ సూచనలు

‘రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు దేశంలో మొదటి పది స్థానాల్లో నిలవాలి. అన్ని ప్రమాణాలూ పెరగాలి. ట్రిపుల్‌ ఐటీలు, ఐఐటీల స్థాయిలో ఉండాలి. అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలి. ఆ దిశలోనే ‘నాడు-నేడు’ కార్యక్రమాలు ఉండాలి.’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగు ఫ్రేమ్‌వర్క్‌లో విశ్వవిద్యాలయాలను ఉన్నత స్థానానికి తీసుకువెళ్లే అంశంపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...

 రెండు జేఏన్టీయూలు, ఆంధ్రా, ఎస్వీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలతో పాటు ఇప్పుడున్న ట్రిపుల్‌ ఐటీలను మెరుగైన స్థాయికి తీసుకువెళ్లడానికి ఎన్ని నిధులు అవసరమో చెప్పండి. కడపలో రానున్న ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి. ఆంధ్రా విశ్వవిద్యాలయం 19వ స్థానం,  ఎస్వీ ‘వర్సిటీ 38వ స్థానం నుంచి రెండేళ్లలో గణనీయంగా మెరుగుపడాలి.


* ®️ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగులో ఉత్తమ స్థానాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లోని విధానాలను అధ్యయనం చేయాలి. మౌలిక సదుపాయాలు, బోధనాపద్ధతులను పరిశీలిస్తూ.. ప్రతిభ ఉన్న వారినే బోధనా సిబ్బందిగా నియమించాలి. అలాగే విదేశాల్లోని అత్యుత్తమ విద్యాసంస్థల విధానాలు పరిశీలించి వాటిని అనుసరించేందుకు ప్రయత్నించాలి. బోధనతో పాటు కోర్సులకు సంబంధించి వాటితో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి.


* ®️ట్రిపుల్‌ ఐటీల్లో 22,946 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో ట్రిపుల్‌ ఐటీల నిధులు రూ.180 కోట్లు మళ్లించారు. శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల నిర్మాణం పూర్తి చేయాలి. అత్యుత్తమమైన బిజినెస్‌ కోర్సులను ప్రవేశపెట్టాలి. ఇంజినీరింగ్‌ కోర్సులకు మంచి మానవ వనరులను అందించాలి.


*®️వైద్య విద్యలో సీట్లు పెరగనున్నాయ్‌*


* ®️రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలలకు తోడు మరో 16 మెడికల్‌ కళాశాలలు తీసుకు వస్తున్నాం. దీంతో మెడికల్‌ సీట్లు గణనీయంగా పెరిగి పేదలకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయి. 70శాతం కన్వీనర్‌ కోటా, 30శాతం చెల్లింపుల పద్ధతిలో సీట్ల కేటాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలి.


* ®️విద్యా, వైద్య వ్యవస్థలు మెరుగుపడాలని రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పెద్ద ఎత్తున ‘నాడు-నేడు’ నిర్వహిస్తున్నాం. అధికారులు మూడు, నాలుగు సార్లు సమావేశమై అత్యుత్తమ విధానాలు, సంస్కరణలు తీసుకురావాలి. అవసరమైన బిల్లులు ఈ శాసనసభ సమావేశాల్లో పెట్టాలి. గ్రామ సచివాలయాల సిబ్బందికి, ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణను ట్రిపుల్‌ ఐటీలతో కలిసి నిర్వహించాలి.

ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌ చంద్ర, ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్‌, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, ఆర్‌జేయూకేటీ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కె.సి.రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Highlights from the CM review"

Post a Comment