Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

It is better to write the Tent test!

టెన్త్ పరీక్ష రాస్తేనే మేలు!

It is better to write the Tent test!

  •  కరోనా భయాలుంటే ఆన్లైన్లో పరీక్షలు పెట్టొచ్చు
  •  మూకుమ్మడిగా ప్రమోట్ చేస్తే అది ఉత్తీర్ణత కిందకు రాదు
  • విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టేనని నిపుణుల భావన

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎస్ఎస్సి రాజకీయం జరుగుతోంది. దీనిపై కోవిడ్ కంటే కూడా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఘంటాపథంగా జెబుతోంది. పరీక్షలు నిర్వహించి తీరుతామని అందుకు వీల్లేదంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై తెలుగుదేశం ఇప్పటికే ఉద్యమాన్ని ప్రారంభించింది. జనసేన కూడా పరీక్షల రద్దుకే కట్టుబడుంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ కూడా దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలెట్టారు. కరోనా వైరస్ ఉన్న గదిలోకి మీ పిల్లల్ని పంపిస్తారా అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రినే ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణ ఇప్పుడు హైకోర్టు కెక్కింది. దీనిపై మూడో తేదీన న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.

ఇప్పటివరకు ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఏమాత్రం రాజీపడ్డంలేదు. కొన్ని రాష్ట్రాలు ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని ఇప్పటికే రద్దు చేసేశాయి. పరీక్ష పెట్టని రాష్ట్రాలు కొన్ని విద్యా ర్ధులకు పాస్ మార్కులు మాత్రమే ఇస్తున్నాయి. కనీస మార్కులు నమోదు చేసి పాసైనట్లుగా సర్టిఫికెట్లు జారీ చేస్తామని ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు పదోతరగతి నుంచి ఉన్నతి సాధించినట్లుగా గుర్తిస్తూ సర్టిఫికెట్లపై ప్రమోటెడ్ అని రాసి జారీ చేసేందుకు సిద్ధపడ్డాయి.

రాష్ట్రంలో 35 లక్షల మంది విద్యార్ధులు ఈసారి పదోతరగతి పరీక్షలు రాస్తున్నారు. ప్రస్తుత వివాదం వారి భవిష్యత్తో ముడిపడుంది. పరీక్షల నిర్వహణపై కేంద్రం తన విధానాన్ని స్పష్టం చేయలేదు. ఈ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించేసింది. దీంతో ఇప్ప టికే ఎపిలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు యం త్రాంగం సమాయత్తమైంది. కోవిడ్ నేపథ్యంలో క వాడా అన్ని జాగ్రత్తలో ఈ నెల 5 వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే వచ్చే నెల 7వ తేదీ నుంచి ఎస్ఎస్సి పరీక్షల్ని నిర్వహించేందుకు ప్ర జాళికలు సిద్ధం చేసింది. ఈలోగానే ఇంటర్ పరీక్షలు పూర్త వుతాయి. ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు ఈ అనుభవం కూడా కలిగిస్తుందని ప్రభుత్వం పేర్కొంటోంది.ఇదిలా ఉంటే పరీక్షల నిర్వహణపై మేధావులు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఏ విద్యార్ధి జీవితానికైనా ఎస్ఎస్ని అత్యంత కీలకం. ఈ పరీక్షల్లో వచ్చే మార్కులే విద్యార్ధి భవిష్యత్ను నిర్దేశిస్తాయి. విద్యార్ధి ఇంజనీరింగ్, మెడిసిన్ లేదా సివిల్ సర్వీసెస్ పూర్తి చేసినప్పటికీ ఎస్ఎస్సి నుండి అర్హత పొందిన అన్ని పరీక్షల్లో సాధించిన మార్కుల్ని ఉద్యోగం, లేదా ఉన్నత చదువులకు ప్రాధమిక అర్హతగా పరిగణిస్తారు. ఎస్ఎస్సి పరీక్షల్ని రద్దు చేసిన కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉత్తీర్ణతకు అర్హతగా పరిగణిస్తున్న కనీస మార్కుల్ని మాత్రమే సదరు విద్యార్ధి సాధించినట్లుగా మార్క్స్. షీట్లు జారీ చేయనున్నాయి. సాధారణంగా అన్ని రాష్ట్రాల్లోనూ సబ్జెక్ట్ వారీగా కనీసం 35 మార్కుల్ని ఉత్తీర్ణతకు ప్రామాణికంగా గుర్తిస్తున్నారు. దీంతో అవే మార్కుల్ని నమోదు చేసి మార్క్స్ షీట్ను అందిస్తాయి. మరికొన్ని రాష్ట్రాలు ఉత్తీర్ణత విషయాన్ని పక్క నపెట్టి ప్రమోటెడ్ అని నమోదుచేసి మార్క్స్ షీటి స్తాయి. అంటే సదరు విద్యార్ధి పదో తరగతి నుంచి పదోన్నతి పొందినట్లుగా పరిగణిస్తున్నట్లు దృవీక రెస్తాయి. సాధారణంగా 15 ఏళ్ళ వయసులో విద్యా ర్థులు పదోతరగతి పరీక్షలు రాస్తారు. ఇప్పటికిప్పుడు వారికీ మార్క్స్షీట్ల కారణంగా ఎలాంటి లాభన ష్టాలుండవు. కానీ మరో పదేళ్ళ తర్వాత ఉద్యోగాలకు దరఖాస్తులు చేస్తారు. ఆయా సమయాల్లో ఇతర రాష్ట్రాలు లేదా జాతీయ అంతర్జా తీయ సంస్థలేవైనా తిరిగి పదోతరగతి నుంచి మార్కు ల జాబితాను కోరతాయి. ఈ జాబితా ద్వారా విద్యార్ధుల క్షేత్రస్థాయి నైపుణ్యాన్ని అంచనాకడతాయి. అలాగే ఎస్ఎస్సి నుంచి పొందే మార్కులకు పాయింట్లు కేటాయిస్తాయి. అప్పుడు ఇలాంటి విద్యార్థులు ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితేర్పడుతుంది. ఉత్తీర్ణత కాకుండా పదోన్నతి పొందిన ప్రమోటెడ్) విద్యా ర్ధుల్ని అంతర్జాతీయ, జాతీయ సంస్థలు పరిగణనలోకి తీసుకోవు. ప్రమోటెడ్ అన్నది ఉద్యోగ విషయంలో అయితే వారి సామర్థ్యానికి గుర్తింపు. కానీ విద్యార్ధుల విషయంలో మార్కులు మాత్రమే సామర్థ్యానికి ప్రాతిపదికగా నిలుస్తాయి.

ప్రస్తుత విద్యార్థుల్లో 90శాతానికి పైగా ఎస్ఎస్సిలో అత్యధిక మార్కులు స్కోర్ చేయగలిగే సామర్ధ్యం కలిగున్నారు. వీరిలో కొందరు నూరు శాతం మార్కు ల్ని పొందగలరు. మరికొందరు 99నుంచి 90శాతం వరకు మార్కుల్ని తమ ఖాతాల్లో వేసుకోగలిగే సామ ర్ధ్యం ఉన్నవారున్నారు. 35శాతం కంటే లోపు మాత్రమే వచ్చే విద్యార్ధులకు ఈ విధానం ప్రయోజనం చేకూరుస్తుంది తప్ప అధిక మార్కుల్ని పొందగలిగే విద్యార్ధులకు భవిష్యత్లో ఇది నష్టదాయకంగా మారుతుంది. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశానికిది అడ్డంకి అవుతుంది. అప్పుడు ఈ రాజకీయ నాయకులు, విపక్షాలు లేదా పాలపక్షం కూడా ముందుకొచ్చి ఈ నాటి పరిస్థితుల్నివారికి వివరించే ప్రయత్నం చేయవు. వాస్తవానికి వీరెవరూ అప్పుడు విద్యార్ధులకు అందుబాటులో నిర్దేశించేది చేతిలో ఉన్న ఉండరు, వారి భవిష్యతను ఎస్ఎస్సి. మార్క్స్షీట్ మాత్రమే. అందులో నమోదయ్యే మార్కులే వారి ఉన్నత విద్యకు, ఉపాధికి దారిచూపిస్తాయి.

నిర్దిష్టవిధానంలో పరీక్షలు రాసి అర్హత సాధిస్తే అది ఉత్తీర్ణత క్రింద లెక్క అలాకాక కొన్ని ప్రత్యేక పరిస్థితు ల్లో విద్యార్ధులు ఒక తరగతి నుంచి మరోతరగతికి పదోన్నతి కల్పిస్తే అది ప్రమోటెడ్గా లెక్క. ఇక్కడ ఏడాది పొడవునా చదివిన విద్యార్ధి నైపుణ్యం లేదా పదేళ్ళ పొడవునా సదరు విద్యార్ధి పొందిన విజ్ఞానాలు పరిగణనలోకి రావు. ఏమాత్రం చదువు అబ్బని విద్యార్ధిని అత్యున్నత స్థాయిలో చదవగలిగే విద్యార్ధిని ఒకే గాటన కడతారు అందరికీ ప్రమోటెడ్గానే మార్క్స్ షీట్లిస్తారు. ఇప్పటి పరిస్తితి పదేళ్ల అనంతరం ఈ విద్యార్థుల భవిష్యత్కడ్డం పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కష్టమే. ఒకే గదిలో 20నుంచి 30మంది రెండుమూడు గంటలకుపైగా కూర్చుని పరీక్ష రాయడం ప్రమాద కరమే. అంతమాత్రాన పరీక్షలు. వద్దనడం సరికాదు. పరీక్షలు విద్యార్థి నైపుణ్యాన్ని, సబ్జెక్ట్ పై అవగాహనను తేటతెల్లం చేయగలుగుతాయి. ఒకట్నుంచి తొమ్మిదో తరగతి వరకు పరీక్షల్ని రద్దు చేసినా ఓ తరగతి నుంచి మరో తరగతికి పదోన్నతి కల్పించినా భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. కానీ పదోతరగతి విషయంలో మాత్రం పరీక్షలు జరగాలి. ఇందుకు ప్రత్యామ్నాయ విధానాల్ని గుర్తించాలి. అవసరమైతే ఆన్లైన్ విధానంలో పరీక్షల్ని చేపట్టాలి. అంతేతప్ప పరీక్షల్లేకుండా మూకుమ్మడిగా ప్రమోట్ చేయడం. లేదా కనీస మార్కుల్తో మార్క్స్షీట్లు జారీ చేయడం. తెలివైన విద్యార్థుల భవితవ్యానికి ఖచ్చితంగా అడ్డుక్టటేయడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "It is better to write the Tent test!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0