Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Nani named the minister who met Anandayya

 ఆనందయ్యను కలిసిన మంత్రి పేర్ని నాని

Nani named the minister who met Anandayya

బోణిగి ఆనందయ్య మొన్నటి వరుకు సాధారణమైన ఆయుర్వేద వైద్యుడు. అది కూడా వారసత్వం గా వచ్చినదే గాని ఆ చదువు చదవలేదు..ఆయుర్వేద వైద్యానికి మాత్రం ఆనందయ్య ఫేమస్. నెల్లూరు జిల్లా నలుమూలలు నుంచి వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆనందయ్య నే ఆశ్రయించేవారు.. అది మొన్నటివరకు మాత్రమే.. ఇప్పుడు ఆనందయ్య పేరు ఆ జిల్లాలోనే కాకుండా రాష్ట్రం..దేశం.మొత్తం మారు మోగుతుంది.. కారణం కోవిడ్ కు ఆయుర్వేద మందు అందించడమే. తీసుకున్నవారికి వ్యాధి కూడా చక్కగా నయమవుతుంది.. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకి పొక్కడంతో వేలాదిగా ప్రజలు తండోప తండాలుగా కృష్ణపట్నానికి వస్తున్నారు.

ప్రస్తుతం ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా మందు పంపిణీకి బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే.

ఈ శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతుండగా. ఒకట్రెడు రోజుల్లో ఐసీఎంఆర్‌ బృందం కూడా కృష్ణపట్నానికి రానుందని అంటున్నారు.

ఇక ఆయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. ఇది అరెస్ట్ కాదని ఆయన రక్షణ కోసమే అని అంటున్నారు. ఆయనను ఉంచిన ఒక హోటల్ లో ఆయనని మంత్రి పేర్ని నాని కలిశారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఆనందయ్య ఆయుర్వేద మందు ఫేమస్ అవుతోంది. కేవలం రెండు రోజుల్లోనే కరోనాను మాయం చేస్తోందంటూ ప్రజలు ఆ మందు కోసం పరుగులు పెడుతున్నారు. చాలా మందిలో కరోనా తగ్గిపోవడంతో ఆనందయ్య ఇచ్చే మందుపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. దీంతో వేలాది మంది నెల్లూరు జిల్లా కృష్ణపట్నంవైపు పరుగులు పెడుతున్నారు. ఐతే ఆయుర్వేద మందుపై దృష్టిపెట్టిన ప్రభుత్వం పంపిణీని వెంటనే నిలిపేసింది. దీనిపై ఐసీఎంఆర్ తో పాటు రాష్ట్ర ఆయుష్ శాఖ దృష్టిపెట్టింది. ఇప్పటికే ఆయుష్ శాఖ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని మందుకు సంబంధించిన శాంపిల్స్, అందులో ఉపయోగించే మూలికలను పరిశీలించారు. వాటిపై అద్యయనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఓ రహస్య ప్రాంతంలో ఆనందయ్య.. అధికారులకు డెమో ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.

ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మందును పంపిణీ చేయవద్దంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో కృష్ణపట్నం నిర్మానుష్యమైంది. ఐతే ఈ మందు కోసం కొందరు దూరప్రాంతాల నుంచి ఇంకా కృష్ణపట్నం వెళ్తున్నారు. ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లుగా కూడా విజృంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కరోనా రోగుల బంధువుల పేరుతో మందును తీసుకెళ్లిన కొందరు వాటిని బ్లాక్ మార్కెట్లు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోగుల అవసరాన్ని బట్టి రూ.3 వేల నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తున్నారన్నట్లు సమాచారం. ఐతే దీనిని ఎక్కడ ఎవరు విక్రయిస్తున్నారనేదానిపై సమాచారం మాత్రం బయటకురావడం లేదు. ఐతే ఈ ప్రచారాన్ని కృష్ణపట్నం వాసులు కొట్టిపారేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆనందయ్య దగ్గర పసరు మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్యకు మళ్లీ అనారోగ్యం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం అత్యంత విషమపరిస్థితుల్లో ఉన్న సమయంలో కోటయ్యకు ఆనందయ్య కంటి పసరు మందు ఇచ్చారు. ఆ సమయంలో ఆక్సిజన్ లెవల్స్ వెంటనే పెరగ్గా.. రెండు రోజుల తర్వాత మళ్లీ ఆక్సిజన్ శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. అలాగే కంటికి సంబంధించిన ఇన్ ఫెక్షన్ కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కంటిలో వేసిన పసరులో జిల్లేడు ఉండటంతో సమస్య వచ్చినట్లు డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయనకు నెల్లూరు జీజీహెచ్ లో ట్రీట్ మెంట్ జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇప్పటికే ఆనందయ్య మందు గురించి తెలుసుకునేందుకు రాష్ట్రమంత్రి పేర్ని నాని నెల్లూరు వెళ్లారు. మందును తయారు చేసే పద్ధతి, అందులో వాడుతున్న మూలికలు, రోగులకు ఇచ్చే డోసులు తదితర అంశాలపై మంత్రి.. ఆనందయ్యతో చర్చించినట్లు తెలుస్తోంది. మరి ఆనందయ్య మందుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆయూష్, ఐసీఎంఆర్ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Nani named the minister who met Anandayya"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0