Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PMSBY SCHEME: 12 rupees debited from Su account ..! However, there seems to be a benefit of Rs 2 lakh.

 PMSBY SCHEME :మీ ఖాతా నుంచి 12 రూపాయలు డెబిట్ అయ్యాయా .. ! అయితే 2 లక్షల ప్రయోజనం ఉన్నట్లే.

PMSBY SCHEME: 12 rupees debited from Su account ..!  However, there seems to be a benefit of Rs 2 lakh.

ప్ర‌మాద బీమా

భవిష్యత్ ప్రమాదాల నుంచి కుటుంబాన్ని రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ బీమా పొందడం చాలా ముఖ్యం. అయితే, పేద ప్రజలు అధిక ప్రీమియం గల పాలసీ తీసుకోవడం భారం కాబట్టి, వారికి సహాయం చేయడం కోసం 2015లో కేంద్రం ప్రభుత్వం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజనను తీసుకొచ్చింది. దీనిలో మీరు సంవత్సరానికి కేవలం 12 రూపాయల ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.2 లక్షల వరకు భీమా పొందవచ్చు.

ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న (పీఎంఎస్‌బీవై) అనేది ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణం, వైక‌ల్యానికి సంబంధించి బీమాను అందించే ప‌థ‌కం. ఈ బీమాకు సంబంధించి.. ఈ నెల‌ మే 31 లోపు బ్యాంకులు రూ.12 ప్రీమియంను బ్యాంక్ ఖాతా నుంచి కట్ చేస్తాయి. ఇప్పటికే మీ ఖాతా నుంచి రూ.12 కట్ అయితే మీకు రూ. 2 లక్షల రూపాయల ప్రమాద భీమా లభిస్తుంది. 

ప్రీమియం: పీఎంఎస్‌బీవై ఒక సంవత్సరం బీమా పథకం. వార్షిక ప్రీమియాన్ని జీఎస్టీతో సహా రూ.12 గా నిర్ణయించారు. పీఎంఎస్‌బీవై ప్రయోజనాలను పొందడానికి ప్రతి సంవత్సరం పునరుద్ధరించాలి. 

అర్హత: బ్యాంకు ఖాతాగల 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ ప్రమాదవ శాత్తు భీమా కోసం నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ, వ్యక్తికి బహుళ బ్యాంకు ఖాతాలు ఉంటే ఒక ఖాతా ద్వారా మాత్రమే బీమాలో చేరవచ్చు.

పీఎంఎస్‌బీవైకి ఎలా ధరఖాస్తు చేసుకోవాలి?

ఈ పథకంలో చేరడానికి ఒక దరఖాస్తును బ్యాంకులో సమర్పించాలి. వ్యక్తి తమ బ్యాంక్ యొక్క నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన కింద ఖాతా తెరవడానికి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్ బుక్, వయస్సు ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, మొబైల్ నెంబర్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అవసరం.

బీమా ప్రయోజనం…

పీఎంఎస్‌బీవై అనేది ప్ర‌మాద బీమా ప‌థ‌కం, ప్ర‌మాదం కార‌ణంగా మరణిస్తే లేదా వైక‌ల్యం చెందితే బీమా అందించ‌బ‌డుతుంది. గుండెపోటు మొద‌లైన స‌హ‌జ కార‌ణాల వ‌ల్ల జ‌రిగే మ‌ర‌ణాల‌కు బీమా క‌వ‌ర్ అందించ‌బ‌డ‌దు. ఈ ప‌థ‌కం కింద రిస్క్ క‌వ‌రేజ్ ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణం మ‌రియు పూర్తి వైక‌ల్యానికి రూ. 2 ల‌క్ష‌లు, పాక్షిక వైక‌ల్యానికి రూ. 1 ల‌క్ష‌, ఖాతాదారుడి మ‌ర‌ణం త‌ర్వాత బీమా చేసిన వ్య‌క్తి నామినీ యొక్క బ్యాంక్ ఖాతాకు బీమా క్లెయిమ్ చెల్లిస్తారు.

Click Here to Download PMSBY Claim form in Telugu

Click Here to Download PMSBY Claim form in English

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PMSBY SCHEME: 12 rupees debited from Su account ..! However, there seems to be a benefit of Rs 2 lakh."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0