Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RRC Western Railway Invites Applications for Apprenticeship; 3,591 Vacancies

 వెస్టర్న్‌ రైల్వేలో 3591 ఖాళీలు - టెన్త్‌ క్లాస్‌, ఐటీఐ అర్హత - మార్కుల ఆధారంగా ఎంపిక

RRC Western Railway Invites Applications for Apprenticeship; 3,591 Vacancies

టెన్త్‌, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి

మే 25 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న వెస్టర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3591 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మే 25 నుంచి ప్రారంభమవుతుంది. 

మొత్తం ఖాళీలు: 3591

ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, వైర్‌మెన్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

విద్యార్హత: మెట్రిక్యులేషన్‌/ పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయసు జూన్‌ 4, 2021 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. మిగిలిన వారు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2021

దరఖాస్తులకు చివరితేది: 24.06.2021


WEBSITE https://www.rrc-wr.com/


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RRC Western Railway Invites Applications for Apprenticeship; 3,591 Vacancies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0